Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంజలికి మద్యం తాగే అలవాటు లేదు.. కుట్రలో నిధి హస్తం!?

anjali
, గురువారం, 5 జనవరి 2023 (15:51 IST)
"తన కుమార్తె ఎపుడూ మద్యం సేవించలేదు. ఆమె ఎపుడూ తాగి ఇంటికి రాలేదు. నిధి అబద్ధం చెబుతోంది" అని అంజలి తల్లి రేఖాదేవి అన్నారు. నిధిని తన కుమార్తెతో కలిసి ఎపుడూ చూడలేదని, ఆ మహిళ ఏనాడూ తమ ఇంటికి రాలేదని ఆమె చెప్పారు. తన కుమార్తె మరణం కుట్రలో నిధి కూడా ఓ భాగమై వుంటారని ఆమె సందేహం వ్యక్తం చేశారు. 
 
నిధిని నేనెపుడూ చూడలేదు. పైగా, ఆమె మా ఇంటికి ఎన్నడూ రాలేదు. ఒకవేళ ఆమె నిజంగా అంజలి స్నేహితురాలైతే ఆమెను వదిలేసి ఎలా పారిపోతుంది? ఇది పథకం ప్రకారం జరిగిన కుట్ర. ఇందులో నిధి పాత్ర కూడా ఉండొచ్చు. దీనిపై సమగ్ర విచారణ జరపాలి అని రేఖాసింగ్ డిమాండ్ చేశారు. కాగా, శవపరీక్షలో మాత్రం ఆమె మద్యం సేవించినట్టుగా ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని వైద్యులు తేల్చారు. 
 
అంజలి మృతి కేసులో సందేహాలెన్నో.. ఎన్నెన్నో...  
ఢిల్లీలోని కంఝావాలా ఏరియాలో అంజలి (20) అనే యువతి కారు ప్రమాదంలో చనిపోయింది. ఈ యువతి చనిపోయి రోజులు గడిచిపోతున్నప్పటికీ.. ఆమె మృతికి స్పష్టమైన కారణాలు ఏంటో పోలీసులు ఇప్పటివరకు వెల్లడింలేకపోతున్నారు. దీనికి కారణం.. కారు నడిపిన ఐదుగురు నిందితుల్లో ఒకరు బీజేపీ నేత కుమారుడు ఉన్నట్టు సమాచారం. అందుకే పోలీసులు కూడా మృతికి కారణాలు వెల్లడించకుండా నాన్చుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.
 
డిసెంబరు 31వ తేదీ రాత్రి తన స్నేహితులతో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్న అంజలి.. జనవరి ఒకటో తేదీ తెల్లవారుజామున 1.45 గంటల ప్రాంతంలో నిధి అనే స్నేహితురాలితో కలిసి స్కూటీపై ఇంటికి బయలుదేరింది. 
 
ఆ స్కూటీని మార్గమద్యంలో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో నిధి ఎగిరిపడగా, అంజలి మాత్రం కారు కింద ఇరుక్కుని పోయింది. అయినా కారును ఆపకుండా ఐదుగురు నిందితులు పరారయ్యారు. ఆఖరుకి 12 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అంజలి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వారు పారిపోయారు. 
 
ఈ అమానవీయ ఘటనపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుకున్నాయి. కానీ 60 గంటలు గడిచిపోయినా సమాధానాలు మాత్రం కొన్ని ప్రశ్నలకే లభించింది. కొత్త సంవత్సర వేళ ఒక కారు 12 కిలోమీటర్ల దూరం మృతదేహాన్ని ఈడ్చుకెళుతుంటే దారిలో ఒక్కరంటే ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా లేరా? ఒక వేళ పోలీసులు ఉంటే మహిళను ఢీకొట్టిన నిందితులు ఎలా తప్పించుకోగలిగారు అనే సమాధానాలు లేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుకున్నది మాటల్లో కాదు.. ఆచరణలో పెట్టండి : ఆనంద్ మహీంద్రా