Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి నుంచి కశ్మీర్‌లో అఖిలపక్షం.. వేర్పాటువాదులతో చర్చలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సారథ్యంలో అఖిలపక్ష బృందం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందుగా శనివారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ అఖిలపక్ష సమా

Advertiesment
All party meeting
, ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (10:27 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సారథ్యంలో అఖిలపక్ష బృందం ఆ రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ పర్యటనకు ముందుగా శనివారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయనతోపాటు కేంద్రమంత్రులు అనంత్ కుమార్, జితేంద్ర సింగ్, పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొననున్నారు. 
 
కాశ్మీర్ గవర్నర్, ముఖ్యమంత్రి, పలు రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్షం చర్చలు జరుపనుంది. అఖిలపక్షంలో రాజ్‌నాథ్ సింగ్‌తో పాటుగా కేంద్ర మంత్రులు జైట్లీ, రాం విలాస్ పాశ్వాన్, కాంగ్రెస్ తరపున గులాం నబీ ఆజాద్, సీతారాం ఏచూరీ (సీపీఎం), డి.రాజా (సీపీఐ), శరద్ యాదవ్ (జేడీయూ), సౌగత రాయ్ (టీఎంసీ), తారీఖ్ అన్వర్ (ఎన్సీపీ), సంజయ్ రావత్ (శివసేన), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), ప్రేమ్ సింగ్ (అకాలీదళ్), దిలీప్ తిర్కే (బీజేడీ), అహ్మద్ (ముస్లిం లీగ్), తోట నరసింహం (టీడీపీ), ఏపీ జితేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్), పి. వేణుగోపాల్ (ఏఐఏడీఎంకే), ప్రేమ్‌చంద్రన్ (ఆరెస్పీ), తిరుచి శివ (డీఎంకే) తదితరులు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బహు భార్యత్వం పురుషుడి కోర్కెలు తీర్చుకోడానికి కాదు.. నిషేధిస్తే వ్యభిచారానికి మార్గం