బహు భార్యత్వం పురుషుడి కోర్కెలు తీర్చుకోడానికి కాదు.. నిషేధిస్తే వ్యభిచారానికి మార్గం
ముస్లిం సమాజంలో ఉన్న బహు భారత్వం పురుషుడి కోర్కె తీర్చడానికి కాదనీ, అదొక సామాజిక అవసరమని, అలాంటిదాన్ని నిషేధించడం వల్ల వ్యభిచారం పెరిగిపోతుందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు అభిప్రాయపడింది.
ముస్లిం సమాజంలో ఉన్న బహు భారత్వం పురుషుడి కోర్కె తీర్చడానికి కాదనీ, అదొక సామాజిక అవసరమని, అలాంటిదాన్ని నిషేధించడం వల్ల వ్యభిచారం పెరిగిపోతుందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు అభిప్రాయపడింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు 63 పేజీలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించింది.
ట్రిపుల్ తలాక్‌ను రాజ్యాంగ విరుద్ధ ఆచారంగా ప్రకటించాలంటూ షాయరా బానూ మరికొందరు బాధితులు దాఖలు చేసుకున్న వ్యాజ్యాలను విచారిస్తున్న సుప్రీంకోర్టుకు ఏఐఎంపీఎల్‌బీ 68 పేజీల ఒక అఫిడవిట్ సమర్పించింది. బహుభార్యాత్వాన్ని గట్టిగా సమర్థిస్తూ, ఇది మహిళల రక్షణ కోసమే ఉద్దేశించినదని బోర్డు తెలిపింది.
'పురుషుల కన్నా మహిళల సంఖ్య తక్కువగా ఉంటే బహుభార్యాత్వానికి అనుమతి లేదు. అప్పుడు మహిళలు పెళ్లిచేసుకోకుండానే బ్రహ్మచారిణిగా జీవితాన్ని గడపాల్సి వస్తుంది. బహుభార్యాత్వం అన్నది పురుషుడి సంతోషాలు, కోర్కెలు తీర్చుకోడానికి కాదు, అదొక సామాజిక అవసరం' అని అందులో పేర్కొంది.
అంతేకాకుండా, 'పురుషుల కన్నా మహిళల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు వారు పెళ్లి చేసుకోడానికి ప్రాధాన్యమిస్తారో లేక ఒక భార్యగా ఉండే హక్కులన్నీ వదులుకుని పురుషులకు ఉంపుడుగత్తెలుగా ఉండేందుకు ఒప్పుకుంటారో వారే తేల్చుకోవాలి' అని ముస్లిం పర్సనల్ బోర్డు అఫిడవిట్లో పేర్కొంది.
అదేసమయంలో ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ హదీసుతోపాటు, ముస్లిం సమాజంలో నెలకొన్న ఏకాభిప్రాయం ప్రకారం పురుషుడు నలుగురిని పెళ్లాడేందుకు అనుమతిస్తుందని తెలిపింది. సామాజిక, నైతిక అవసరాల మేరకు పురుషులు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటారని, తమ భార్యల పట్ల ప్రేమ, సహానుభూతితో వ్యవహరించడం ఎంతో ముఖ్యమని పేర్కొంది. బహుభార్యాత్వాన్ని ఇస్లామిక్ మూలగ్రంథాలు అనుమతించాయి కాబట్టి దానిని నిషేధించినట్లుగా ఎవరూ పేర్కొనరాదని బోర్డు స్పష్టం చేసింది.