Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువు పెరిగిన ఎయిర్‌హోస్టెస్... 57 మందికి డిమోషన్... ఎక్కడ?

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ఇటీవలి కాలంలో నిత్యం వార్తలకెక్కుతోంది. ఆ సంస్థ అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల అటు సంస్థ ఉద్యోగులతో పాటు.. ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు

బరువు పెరిగిన ఎయిర్‌హోస్టెస్... 57 మందికి డిమోషన్... ఎక్కడ?
, శుక్రవారం, 20 జనవరి 2017 (14:48 IST)
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా. ఇటీవలి కాలంలో నిత్యం వార్తలకెక్కుతోంది. ఆ సంస్థ అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల అటు సంస్థ ఉద్యోగులతో పాటు.. ఇటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఆ సంస్థకు చెందిన 57 మంది సిబ్బందికి డిమోషన్ ఇచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎయిర్ హోస్టెస్‌లతో పాటు క్యాబిన్ క్రూలో పని చేసే సిబ్బంది ఉన్నారు. వీరు చేసిన నేరమేంటో తెలుసా? అధిక బరువు పెరగడమే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఎయిర్ ఇండియా సంస్థలోని విమానాల్లో పని చేసే ఎయిర్‌హోస్టెస్‌లతో పాటు ఇతర సిబ్బంది అధిక బరువు పెరిగారు. ఈ విషయాన్ని బాడీ మాస్ ఇండెక్స్ పరీక్షల ద్వారా గుర్తించారు. ఇలాంటివారిని క్యాబిన్ క్రూ విభాగం నుంచి గ్రౌండ్ డ్యూటీకి బదిలీ చేశారు. దీనిపై ఆ సంస్థ అధికారులు స్పందిస్తూ అధిక బరువు కలిగిన వారిని గుర్తించి గ్రౌండ్ డ్యూటీకి బదిలీ చేశామని, తాము విధించిన గడువులోగా బరువు తగ్గకుంటే వీరిని శాశ్వతంగా గ్రౌండ్ డ్యూటీ విభాగానికి పరిమితం చేస్తామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియా రెడ్డి వాహనంపై దాడి... 8 మంది అరెస్టు