Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియా రెడ్డి వాహనంపై దాడి... 8 మంది అరెస్టు

టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా రెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సీసీ కెమెరాల సాయంతో నిందితులను గుర్తించి 8 మందిని

భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియా రెడ్డి వాహనంపై దాడి... 8 మంది అరెస్టు
, శుక్రవారం, 20 జనవరి 2017 (14:35 IST)
టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా రెడ్డిపై దాడి జరిగింది. ఈ దాడి కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. సీసీ కెమెరాల సాయంతో నిందితులను గుర్తించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్నారు. 
 
గురువారం సాయంత్రం అఖిల ప్రియ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తుండగా కొంతమంది వైకాపా కార్యకర్తలు ఆమె వాహనాన్ని చుట్టుముట్టి అడ్డుకున్న విషయం తెల్సిందే. వీరంతా వైకాపా జెండాలు పట్టుకుని కారును అడ్డుకున్నారు. కారులో ఆ సమయానికి అఖిల ప్రియ, గన్‌మెన్, డ్రైవర్ మాత్రమే ఉన్నారు. కారు అద్దాలు కొడుతూ, వ్యతిరేక నినాదాలు చేస్తూ కారును ముందుకు వెళ్లనివ్వలేదు. దీంతో పోలీసులు సాయంతో కారును ముందుకు పోనిచ్చారు. దీపిపై పోలీసులు ముమ్మర విచారణ చేసి 8 మందిని అరెస్టు చేశారు.
 
ఈ సంఘటనపై వైకాపా నేత అంబటి రాంబాబు స్పందిస్తూ.. అఖిల ప్రియా రెడ్డి వాహనంపై తమ పార్టీ కార్యకర్తలు ఎవరిమీద దాడికి ప్రయత్నించలేదన్నారు. అంత అవసరం కూడా తమకు లేదని అన్నారు. అన్యాయంగా వైకాపా కార్యకర్తలను అరెస్టు చేశారని అన్నారు. దమ్ముంటే తమ పదవులకు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ కళ్యాణ్ పంథాను ఫాలో అవుతున్న జగన్... ఆయన సత్తా అంతేనా?