Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగుళూరులో చిన్నమ్మకు... చెన్నైలో దినకరన్‌లకు షాక్

అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నేత టీటీవీ దినకరన్‌‌ను అరెస్టు చేసేందుకు తమిళనాడు రాష్ట్ర పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, అక్రమార్జన కేసులో బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్షను అనుభవిస

Advertiesment
బెంగుళూరులో చిన్నమ్మకు... చెన్నైలో దినకరన్‌లకు షాక్
, బుధవారం, 4 అక్టోబరు 2017 (13:51 IST)
అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నేత టీటీవీ దినకరన్‌‌ను అరెస్టు చేసేందుకు తమిళనాడు రాష్ట్ర పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు, అక్రమార్జన కేసులో బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్షను అనుభవిస్తున్న ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ పెట్టుకున్న పెరోల్ దరఖాస్తు తోసివేతకు గురైంది. ఈ రెండు పరిణామాలు ఒకే రోజు జరగడం రాష్ట్ర రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. 
 
ఇటీవల సేలం జిల్లా షణ్ముగనగర్‌లో నీట్‌ పరీక్ష మినహాయింపు కోరుతూ అన్నాడీఎంకే స్థానిక నాయకులు కొందరు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ప్రధాని మోడీలను విమర్శిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సేలం పోలీసులు దినకరన్‌తో పాటు.. కర్ణాటక విభాగానికి చెందిన పార్టీ నేత పుగళేందిని సైతం నిందితులుగా చేర్చి మొత్తం 37 మందిపై కేసులు నమోదు చేశారు.
 
ఈ కేసులో దినకరన్‌ను అరెస్టు చేయడానికి పోలీసులు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. సోమవారం అర్థరాత్రి దినకరన్‌ను అరెస్టు చేస్తారని చెన్నై నగరమంతటా తీవ్ర పుకార్లు వ్యాపించాయి. బుధవారం అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు ఊపందుకున్నాయి. 
 
ఇదిలావుండగా, చెన్నై గ్లోబల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త నటరాజన్‌ను చూడటానికి గాను బెంగుళూరులో పెరోల్‌ కోసం పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమెకు పెరోల్ మంజూరు చేసేందుకు బెంగుళూరు జైలు అధికారులు నిరాకరించారు. ఒకేసారి రెండు చోట్ల చుక్కెదురు కావడంతో దినకరన్ వర్గీయులు తీవ్ర నిరాశలో కూరుకునిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌లో రిలయన్స్ జియో 4జీ ఫోన్ల డెలివరీ స్టార్ట్