Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జే అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీ.. నాయకురాలిగా జయ అన్న కుమార్తె దీప.. వర్కౌట్ అవుతుందా?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసులు ఎవరనే దానిపై క్లారిటీ రాకపోవడంతో పాటు.. ఆమె నెచ్చెలి అంటే గిట్టని వారు జే అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీకి వ్యుహ రచన చేస్తున్నట్టు సమాచారం. అన్నాడీఎం

జే అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీ.. నాయకురాలిగా జయ అన్న కుమార్తె దీప.. వర్కౌట్ అవుతుందా?
, శనివారం, 10 డిశెంబరు 2016 (08:30 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రాజకీయ వారసులు ఎవరనే దానిపై క్లారిటీ రాకపోవడంతో పాటు.. ఆమె నెచ్చెలి అంటే గిట్టని వారు జే అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీకి వ్యుహ రచన చేస్తున్నట్టు సమాచారం. అన్నాడీఎంకే కేసులను సుప్రీం కోర్టులో వాదించే న్యాయవాది కృష్ణమూర్తి జయలలిత పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
అయితే ఈ పార్టీకి అధ్యక్షురాలిగా జయలలిత అన్న కుమార్తె దీపను నియమించనున్నట్లు కృష్ణమూర్తి ఓ ఆడియోను కూడా విడుదల చేశారు. ఈ ఆడియోను విడుదల చేసినప్పటి నుంచి ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయి. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటికి వివరణ ఇవ్వాలని తాను ఆడియోలో పేర్కొన్న వార్తలన్నీ అసత్యమని చెప్పమని.. అన్నాడీఎంకే కార్యకర్తలు కృష్ణమూర్తిని బెదిరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా వాట్సాప్‌లో హల్ చల్ చేస్తోంది. 
 
రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా కేవలం జయ బంధువు అన్న కారణంగా జనం ఆమెను ఆదరిస్తారా అన్నది ఆలోచించాల్సిందే. శశికళ మద్దతుదారులు మాత్రం అసలు కృష్ణమూర్తికి అన్నాడీఎంకేతో సబంధమే లేదని ప్రకటించారు. కాగా తమిళ రాజకీయాలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. తన ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిసినా వారసుడిని ఎంపిక చేయకుండానే మృత్యుముఖంలోకి జారిపోయిన జయలలిత పార్టీని నడిసంద్రంలో వదిలేసినట్టయింది. 
 
అధికారం కోసం పార్టీలో పోరు జోరందుకుంటోంది. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా జయకు పార్టీ అధ్యక్షురాలిగా పగ్గాలు అప్పగించేందుకు ప్రాథమికంగా అంగీకారం లభించిన సంగతి తెలిసిందే. కానీ శశికళ పొడగిట్టని వారు ఆమెను అధ్యక్షురాలిగా చేయకూడదని పార్టీలోని కొందరు వాదిస్తున్నారు. అయితే చిన్నమ్మ శశికళ ఇప్పటికే పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. సీఎం పన్నీర్ సెల్వం కూడా ఆమె అధికారాన్ని గుర్తిస్తూ పోయెస్ గార్డెన్‌కు వెళ్లి మరీ మంతనాలు జరుపుతున్నారు. మరి అన్నాడీఎంకే ఆధిపత్య పోరులో ఎవరిది పైచేయి అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలితకు చికిత్స.. అపోలో మెడికల్ బిల్లెంతో తెలుసా? అక్షరాలా రూ.80 కోట్లు..