Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జయలలితకు చికిత్స.. అపోలో మెడికల్ బిల్లెంతో తెలుసా? అక్షరాలా రూ.80 కోట్లు..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితన 75 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుకుని చికిత్స అందించిన అపోలో బాగాను గుంజుకుందని వార్తలు వస్తున్నాయి. తమిళ మీడియా అపోలోపై సెటైర్లు, విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్

Advertiesment
Apollo Hospital bill to cross Rs 80 crores
, శనివారం, 10 డిశెంబరు 2016 (08:14 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితన 75 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుకుని చికిత్స అందించిన అపోలో బాగాను గుంజుకుందని వార్తలు వస్తున్నాయి. తమిళ మీడియా అపోలోపై సెటైర్లు, విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అమ్మకు చికిత్స అందించేందుకు అపోలో ఏకంగా రూ.80కోట్లు తీసుకుందని తెలిసింది.
 
సమాచార హక్కు చట్టం ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్‌తో ఈ విషయం బహిర్గతమైంది. జయకు చికిత్స అందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం అమ్మ మరణానికి అనంతరం మెడికల్ బిల్లు రూ.80 కోట్లని.. మిగిలిన ఖర్చులను కలిపితే ఆ మొత్తం కాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
 
ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ బిల్లులో ఇప్పటికే రూ.6 కోట్లు చెల్లించింది. ప్రజా ప్రతినిధులు అనారోగ్యానికి గురైనపుడు వైద్య ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. జయ వైద్యానికి అయిన ఖర్చులను కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల తరువాత జయ ఉన్న రెండో అంతస్తు మొత్తం ఖాళీ చేయించారు. దీంతో ఆ అంతస్తులోని 30 గదుల అద్దెను రాష్ట్ర సర్కారే చెల్లించాల్సి వుంటుంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ అనుచరుల గుండెల్లో రైళ్లు... ఇళ్లపై ఐటీ దాడులు...