గాలి కంటే భారీగా... కాంగ్రెస్ నేత కొడుకు పెళ్లి జరుగబోతోంది, ఇక రాహుల్ ఏం మాట్లాడుతారో?
బెంగళూరు : పెళ్లికి రెండున్న లక్షల రూపాయలు మాత్రమే డ్రా చేసుకోవాలని కండిషన్లు పెడుతున్న సర్కారు... బడా నేతల ఇంట్లో పెళ్లిళ్ళు కోట్ల ఖర్చు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధనరెడ్డి క
బెంగళూరు : పెళ్లికి రెండున్న లక్షల రూపాయలు మాత్రమే డ్రా చేసుకోవాలని కండిషన్లు పెడుతున్న సర్కారు... బడా నేతల ఇంట్లో పెళ్లిళ్ళు కోట్ల ఖర్చు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధనరెడ్డి కూతురి పెళ్లి ఈ నెల 16న ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి వందల కోట్లు ఖర్చయిందని అంచనా. నోట్ల రద్దుతో జనం నానా పాట్లు పడుతుంటే గాలి ఇంత డబ్బు ఖర్చు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో బీజేపీపై విరుచుకుపడ్డాయి.
బీజేపీనే గాలికి కొమ్ము కాస్తుందని మండిపడ్డాయి. కాంగ్రెస్ కూడా ఈ విషయంలో కాస్త గట్టిగానే ప్రశ్నించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ నోటికి తాళం పడింది. గాలి జనార్థనరెడ్డి కూతురి పెళ్లి కంటే ఘనంగా కర్ణాటకలో మరో పెళ్లి జరుగబోతోంది. ఈ పెళ్లి అక్కడి అధికార పార్టీ కాంగ్రెస్‌లోని మంత్రి కొడుకుది కావడం గమనార్హం. కర్ణాటకలోని చిన్నతరహా పరిశ్రమల మంత్రి రమేష్ జర్కిహొలి తన కొడుకు సంతోష్ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయబోతున్నారు. ఈ పెళ్లి కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పెళ్లి మండపాన్నే రెండు ఎకరాల్లో నిర్మిస్తున్నారు. గోకక్ పట్టణంలో ఆదివారం ఈ పెళ్లి జరగబోతోంది. పట్టణమంతా మంత్రి కొడుకు పెళ్లికి సంబంధించిన ఆహ్వాన బ్యానర్లు, కటౌట్లతో ముస్తాబైంది. దాదాపు లక్ష మందికి పైగా ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి మండపం అంతా ఎయిర్ కండీషన్డ్ కావడం విశేషం. పట్టణ శివార్లలో వీవీఐపీల హెలికాఫ్టర్ల కోసం హెలిప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లి మండపాన్ని కొల్హాపూర్‌లోని మహాలక్ష్మి ఆలయం మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పెళ్లికి పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.