Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఏఎస్ టాపర్స్ లవ్ స్టోరీ.. పరీక్షల్లో ఆమెను గెలవలేకపోయాడు.. మనస్సును కొల్లగొట్టాడు..

2015 ఐఏఎస్ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది టీనా దాబీ అనే 22 ఏళ్ల యువతి. అదే ఫలితాల్లో రెండో స్థానంలో టాపర్‌గా నిలిచాడు అమీర్ ఉల్ షఫీ ఖాన్. ఐఏఎస్ పరీక్షల్లో టీనాను జయించలేకపోయిన షపీ ఖాన్.. నిజ జీవితంల

Advertiesment
Love in a Sarkari set-up: 2015 IAS topper Tina Dabi to wed No 2 Athar Aamir-ul-Shafi Khan
, బుధవారం, 23 నవంబరు 2016 (17:42 IST)
2015 ఐఏఎస్ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది టీనా దాబీ అనే 22 ఏళ్ల యువతి. అదే ఫలితాల్లో రెండో స్థానంలో టాపర్‌గా నిలిచాడు అమీర్ ఉల్ షఫీ ఖాన్. ఐఏఎస్ పరీక్షల్లో టీనాను జయించలేకపోయిన షపీ ఖాన్.. నిజ జీవితంలో మాత్రం ఆమె మనస్సును కొల్లగొట్టాడు. అవును. వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. 
 
ప్రస్తుతం ముస్సోరీలోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఫర్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందుతున్న టీనా దాబీ, తమ వివాహానికి తేదీని ఖరారు చేయలేదని, త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకుంటామని స్పష్టం చేశారు. ఉత్తీర్ణులకు జరిగిన సన్మాన సభలో తొలిసారి షపీ ఖాన్‌ను కలిశానని..అప్పుడే ప్రేమలో పడ్డానని టీనా చెప్పింది. 
 
కాగా, వీరి ఫోటోలను చూసిన కొందరు, ఆమె తన విలువైన సమయాన్ని వృథా చేస్తోందని, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో తప్పటడుగు వేసిందని కామెంట్సు చేస్తుండగా, మరికొందరు వీరి ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరెన్సీ కష్టాలు : మీరు కోరినట్టుగా ఒకే చోట విచారించలేం... కేంద్రానికి సుప్రీంకోర్టు