Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అతడితో ఆ సంబంధం మానుకోమన్నందుకు భర్తను సెల్ ఫోన్ ఛార్జర్ వైరును గొంతుకు చుట్టి...

Advertiesment
అతడితో ఆ సంబంధం మానుకోమన్నందుకు భర్తను సెల్ ఫోన్ ఛార్జర్ వైరును గొంతుకు చుట్టి...
, శనివారం, 19 సెప్టెంబరు 2020 (17:43 IST)
పెళ్ళయి మూడేళ్ళు. రెండేళ్ళ పాప కూడా ఉంది. అన్యోన్యంగా సాగిపోతున్నసంసారం. అయితే భార్యకు గొంతెమ్మ కోర్కెలు ఎక్కువ. భార్యకు ఎన్ని కొనిచ్చినా ఆశ మాత్రం తీరడం లేదు. భర్త అడిగిన దాన్ని తీసివ్వడం లేదని ఆమె వేరొక వ్యక్తికి దగ్గరైంది. భర్తకు తెలియడంతో అతడినే అతి దారుణంగా చంపేసింది.
 
కోల్‌కతాకు చెందిన అనిందిత పాల్, రజత్‌లకు మూడేళ్ళ క్రితం వివాహమైంది. అనిందిత లాయర్. రజత్ ప్రైవేటు పైప్ కంపెనీని నడుపుతున్నాడు. కరోనా కారణంగా కంపెనీ మూతపడటం, ఆర్థికంగా బాగా నష్టపోయాడు రజత్. అయితే భార్య మాత్రం తనకు కావాల్సిదంతా కొనివ్వమంటూ డబ్బులు లేని భర్తను చిత్రహింసలకు గురిచేసేది.
 
దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతూ ఉండేది. లాయర్‌గా ఉన్న అనిందిత తన క్లైంట్ ఒకరు మంచి ధనవంతుడు కావడంతో అతడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతను ఆర్థికంగా బాగా స్థిరపడ్డాడు. దీంతో భర్తకు తెలియకుండా అతడివద్దకు వెళ్తుండేది. కానీ రెండురోజుల క్రితం విషయం భర్తకు తెలిసింది.
 
మందలించాడు. వార్నింగ్ ఇచ్చాడు. దీనితో భర్తను ఎలాగైనా చంపేయాలని, ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది. బాగా నిద్రపోతున్న భర్తను సెల్ ఫోన్ ఛార్జర్‌ వైరుతో గొంతుకు చుట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. అలా హత్య చేసిన ఆమె తెల్లవారగానే తన భర్త ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులను నమ్మించింది. కానీ పోస్టుమార్టంలో అసలు విషయం బయటపడింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంకా ఎన్ని ప్రాణాలు బలైపోవాలి చెప్పండి? కేసీఆర్ పైన విజయశాంతి పైర్