Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మాయిని లేపుకొచ్చిన కొడుకు, సహకరించిన తల్లి, చివరికి?

అమ్మాయిని లేపుకొచ్చిన కొడుకు, సహకరించిన తల్లి, చివరికి?
, సోమవారం, 14 సెప్టెంబరు 2020 (21:21 IST)
ఏ తల్లి చేయని పని ఆ తల్లి చేసింది. కొడుకు పెడమార్గాన వెళుతుంటే అతనికి మంచి బుద్థులు నేర్పించాల్సింది పోయి అతనికి సహకరించింది. చివరకు కటాకటాల పాలైంది. తమిళనాడు రాష్ట్రం మధురైలోని సక్కిమంగళం నావాస్త్రా ప్రాంతంలో మహాలింగం, భాగవతి దంపతులు నివాసమున్నారు. వీరికి సెంథిల్ అనే 18 యేళ్ళ కుమారుడు ఉన్నాడు. మహాలింగం మార్కెటింగ్ పని మీద నెలకు 15 రోజులు బయటి ప్రాంతంలో తిరుగుతుండేవాడు.
 
దీంతో కొడుకు బాగోగులు తల్లి చూస్తుండేది. లాక్‌డౌన్ కావడంతో సెంథిట్ ఇంటి పట్టునే ఉండేవాడు. స్మార్ట్ ఫోన్లలో అశ్లీల చిత్రాలు చూస్తూ ఉండేవాడు. అది తెలిసిన తల్లి అతడిని మందలించకుండా తనకేం తెలియనట్లు వ్యవహరిస్తూ వచ్చింది.
 
తమ ఇంటికి కాస్త దూరంలో 15 యేళ్ళ బాలిక ఉంది. సెంథిల్ ఆ బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఆ బాలిక ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం వెళుతూ ఉండేది. 
 
రెండురోజుల క్రితం ఆన్‌లైన్ క్లాస్‌లు పూర్తి చేసుకుని తిరిగి వస్తుంటే సెంథిల్ తన బైక్ పైన డ్రాప్ చేస్తానని చెప్పాడు. ఇంటి పక్కన వ్యక్తే కాబట్టి బండిపై ఎక్కింది. తన ఇంటికి తీసుకెళ్ళిన సెంథిల్ యువతిని ఒక గదిలో బంధించాడు.
 
రెండురోజుల పాటు ఆమెను లైంగికంగా చిత్రహింసలు పెట్టాడు. ఆ సమయంలో తల్లి ఇంట్లోనే ఉంది. అయినా కొడుక్కి అడ్డు చెప్పలేదు కదా అతను చేస్తున్న పనిని తన కళ్ళారా చూసింది. యువతి కనిపించకపోయే సరికి పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
 
అయితే నిన్న ఉదయం ఆ యువతిని ఇంటి నుంచి పంపిస్తూ జరిగిన విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించారు తల్లీకొడుకులు. కానీ ఆ యువతి ఇంటికి వెళ్ళి అసలు విషయాన్ని చెప్పేసింది. పోలీసులు నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజమ్మా, నువ్వు గ్రేటమ్మా, ఏం చేశారంటే..?