కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ముఖానికి మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది. ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అసలు మాస్క్ లేకుండా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. తాజాగా ఓ యువకుడు మాస్క్ పెట్టుకోలేదని ఆడిగినందుకు కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
పోలీసులు తమ ప్రత్యేక వాహనాల్లో రౌండ్స్ కొడుతూ ఎక్కడైనా ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే.. రఫ్పాడిస్తున్నారు. ఈ క్రమంలో ఖుషీ నగర్లో ఓ యవకుడు మాస్క్ లేకుండా దర్జాగా వెళ్తుంటే.. కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే అతన్ని ఆపి జీపులో ఉన్న ఇన్స్పెక్టర్ దగ్గరకు పంపాడు. ఇన్స్పెక్టర్ ఆ కుర్రాడి కాలర్ పట్టుకొని... "మాస్క్ పెట్టుకోమని చెబితే ఎందుకంత నిర్లక్ష్యం ఏంటి'' అంటూ ఫైర్ అయ్యి చెయ్యి చేసుకున్నాడు.
దీంతో ఆ యువకుడు పెట్టుకుంటాను సార్ అని అమాయకుడిలా నటిస్తుంటే.. పోనీలే అని అతనికి ఫైన్ వెయ్యకుండా వదిలాడు ఇన్స్పెక్టర్. అంతే ఆ క్షణంలో ఆ కుర్రాడు ఇన్స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు. షాకైన ఇన్స్పెక్టర్.. రేయ్ అనేసరికి. అక్కడి నుంచి పరుగందుకున్నాడు. అతన్ని పట్టుకుందామని పరుగెత్తిన కానిస్టేబుల్కి అతన్ని పట్టుకోవడం కుదరలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.