ఈశాన్య రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వివరాల మేరకు.. అసోంలోని తిన్‌సుకియా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.42 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 2.7గా నమోదయింది. పశ్చిమ బెంగాల్‌లో ఉదయం 7.07 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి.
సిలిగురికి తూర్పున 64 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమయింది. దీని తీవ్రత 4.1 గా నమోదయింది. సిక్కిం-నేపాల్ సరిహద్దు సహా అసోం, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో గత సోమవారం రాత్రి స్వల్పంగా భూమి కంపించింది.
12 గంటల వ్యవధిలోనే రెండుసార్లు భూ ప్రకంపనలు సంభవించడంతో ఆయా రాష్ట్రాల విపత్తు శాఖలు అప్రమత్తమయ్యాయి. తాజాగా సంభవించిన భూకంపంపై ప్రధాని నరేంద్ర మోడి అధికారులతో సమీక్షించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.