Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 10 January 2025
webdunia
Advertiesment

బీహార్‌లో ఓవైసీకి బిగ్ షాక్ : ఆర్జేడీలో చేరిన ఎంఐఎం ఎమ్మెల్యేలు

asaduddin owaisi
, గురువారం, 30 జూన్ 2022 (11:48 IST)
బీహార్ రాష్ట్రంలో ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో ఎంఐఎంకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఒక్కరు మినహా మిగిలిన నలుగురు ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామంతో 243 మంది సభ్యులు గల రాష్ట్ర అసెంబ్లీలో ఆర్జేడీ బలం 80కు చేరింది. భాజపా కంటే మూడు స్థానాలు ఎక్కువ కావడంతో లాలూ పార్టీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
అయితే, ఎన్డీయే పాలన సాగుతున్న రాష్ట్రంలో లౌకిక శక్తులను బలోపేతం చేసే చర్యగా ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్‌ దీన్ని అభివర్ణించారు. 2020లో బీహార్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయంతో మజ్లిస్‌ పార్టీ సంచలనం సృష్టించింది. వీరిలో సయ్యద్‌ రుక్నుద్దీన్‌ అహ్మద్‌ (బాయీసీ), షానవాజ్‌ ఆలం (జోకీహాట్‌), మహ్మద్‌ ఇజార్‌ అస్ఫి (కోచాధామన్‌), మహ్మద్‌ అంజార్‌ నయీమీ (బహదూర్‌గంజ్‌) ఆర్జేడీలో చేరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనకాపల్లి జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ సంచారం