బీహార్ రాష్ట్రంలో పిడుగుల వర్షం కురిసింది. ఈ పిడుగులపాటుకు ఏకంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు వీయడంతోపాటు పెద్ద ఎత్తున పిడుగులు పడ్డాయి. దీంతో ఒక్క రోజులోనే పిడుగుపాటుతో 16 మంది చనిపోయారు. ఈ రాష్ట్రంలో ఇప్పటివవరకు కురిసిన పిడుగుల వర్షానికి 36 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.
మంగళవారం ఈస్ట్ చంపారాన్ జిల్లాలో నలుగురు, భోజ్‌పూర్ జిల్లాకు చెందిన ముగ్గురు, సరన్ జిల్లాలో ముగ్గురు, వెస్ట్ చంపారాన్ జిల్లాలో ఇద్దరు, అరారియ జిల్లాలో ఇద్దరు బంకా ముజఫర్‌పూర్ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు, ఈ పిడుగల వర్షంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అలాగే, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.