Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

13 ఏళ్ల అమ్మాయిపై దారుణం.. తొమ్మిది మంది.. మూడేసి సార్లు.. ట్రక్కు మార్చి..?

Advertiesment
13 ఏళ్ల అమ్మాయిపై దారుణం.. తొమ్మిది మంది.. మూడేసి సార్లు.. ట్రక్కు మార్చి..?
, ఆదివారం, 17 జనవరి 2021 (14:13 IST)
13 ఏళ్ల అమ్మాయిపై దారుణం జరిగింది. తొమ్మిది మంది మృగాలు.. మూడేసి సార్లు ట్రక్కు మార్చి ట్రక్కులోకి ఎక్కించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. రోడ్డు మీద వదిలేసి పరారయ్యారు. రోడ్డు మీద కనపడిన వాళ్లను సాయమడిగినా ఎవరూ స్పందించలేదు. 
 
సాయం చేసినట్టే చేసిన ఓ ట్రక్కు డ్రైవర్.. తానూ మృగాన్నేనని నిరూపించాడు. అతడూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెను వదిలేసి పరారయ్యాడు. మొత్తంగా 9 మంది ఓ బాలిక జీవితంతో పైశాచిక ఆనందం పొందారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉమేరియాలో ఈనెల 11-12 తేదీల మధ్య జరిగింది. ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
 
వివరాల ప్రకారం.. ఉమేరియాలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక.. ఈ నెల 11న షాపునకు వెళ్లింది. ఇద్దరు ట్రక్కు డ్రైవర్లు ఒంటరిగా వెళుతున్న బాలికను కిడ్నాప్ చేశారు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. ట్రక్కులోనే బందీగా ఉంచి ఓ దాబాకు తీసుకెళ్లారు. 
 
అక్కడ మరో ఐదుగురు ఆ ఇద్దరితో కలిసి దారుణానికి పాల్పడ్డారు. దాబా యజమాని కూడా కనికరం చూపలేదు. తర్వాత ట్రక్కులోకి ఎక్కించి ఆ రోజు రాత్రంతా బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మానసికంగా చాలా కుంగిపోయిందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా.. 299 పాజిటివ్ కేసులు