Miscellaneous Cookery Indian 0901 02 1090102057_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంగవాయిలు మామిడికాయ పప్పు

Advertiesment
వంటకాలు భారతీయ గంగవాయిలు ఆకుకూర కందిపప్పు పచ్చి మామిడికాయలు నెయ్యి ఉప్పు జీలకర్ర ఆవాలు మెంతులు
కావలసిన పదార్థాలు :
గంగవాయిలు ఆకుకూర... ఒక కట్ట
కందిపప్పు... ఒక కప్పు
పచ్చి మామిడికాయలు... రెండు
పచ్చిమిరపకాయలు... నాలుగు లేదా ఐదు
నెయ్యి... రెండు టీస్పూన్లు
ఉప్పు... తగినంత
జీలకర్ర, ఆవాలు, మెంతులు... పోపుకు సరిపడా
పసుపు... అర టీస్పూను
వెల్లుల్లి రేకలు... ఐదు

తయారీ విధానం :
ముందుగా గంగవాయిలు ఆకుకూరను శుభ్రం చేసుకుని, నీటిలో బాగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే మామిడికాయలను కూడా కడిగి, ఆపై తురిమి పక్కన ఉంచుకోవాలి.

ఒక బాణలిలో నెయ్యివేసి స్టవ్‌పై పెట్టి, కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిలతో తాలింపు పెట్టాలి. అందులోనే మామిడికాయ తరుమును, తరిగి ఉంచుకున్న గంగవాయిలు కూరను వేసి బాగా వేయించాలి.

ఆ తరువాత, అందులోనే నానబెట్టి ఉంచుకున్న పప్పు, రెండుగా చీల్చిన పచ్చిమిరపకాయలను కలిపి, తగినంత నీరు పోసి ఉడికించాలి. పప్పు బాగా ఉడికిన తరువాత దించేయాలి. అంతే గంగవాయిలు మామిడికాయ పప్పు రెడీ అయినట్లే...! దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే... అద్భుతమైన రుచితో మిమ్మల్ని అలరిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu