Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోజుకో కొబ్బరి బోండాం నీటిని పిల్లలకు తాగిస్తే...

కొబ్బరి నీరు కొవ్వు పదార్థాలను కలిగి వుంటుంది. ఇవి జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతాయి. అంతేకాకుండా మానసిక అలసటను మాయం చేస్తుంది. రక్తంలోని చక్కర స్థాయులను సమతుల్యపరచడంతో పాటు మానసిక రుగ్మతలకు చెక్ పెడు

రోజుకో కొబ్బరి బోండాం నీటిని పిల్లలకు తాగిస్తే...
, శుక్రవారం, 15 డిశెంబరు 2017 (17:52 IST)
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. ? పరీక్షల్లో మంచి మార్కులు కొట్టేయాలంటే.. రోజుకో కొబ్బరి బోండాం నీటిని తాగించాలని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. పిల్లల్లో మెదడు పనితీరును మెరుగుపరచడంలో కొబ్బరి నీరు భేష్‌గా పనిచేస్తుంది. సాధారణంగా మెదడు పనితీరుకు కూడా కొవ్వు  పదార్థాలు కూడా అవసరం. 
 
కొబ్బరి నీరు కొవ్వు పదార్థాలను కలిగి వుంటుంది. ఇవి జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతాయి. అంతేకాకుండా మానసిక అలసటను మాయం చేస్తుంది. రక్తంలోని చక్కర స్థాయులను సమతుల్యపరచడంతో పాటు మానసిక రుగ్మతలకు చెక్ పెడుతుంది. ఒత్తిడిని అదుపులో వుంచడంలో మెరుగ్గా పనిచేస్తుంది. కొబ్బరి నీటిలో ఉండే కొవ్వు, అమైనోఆసిడ్‌లు సెరొటోనిన్ వంటి హార్మోన్‌లను స్థిరీకరిస్తుంది. 
 
తద్వారా ఏకాగ్రత లోపం దూరం అవుతుంది. వారాంతపు సెలవుల్లో, లేదా గ్లాసుడు కొబ్బరి నీళ్లను పిల్లలు తాగేలా చేస్తే వారి మెదడు పనితీరు మెరుగుపరుచవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇదే తరహాలో టమోటా జ్యూస్, దానిమ్మ రసం, బీట్ రూట్ రసాన్ని వారానికి రెండుసార్లైనా పిల్లల ఆహారంలో భాగంగా చేర్చాలి. ఇలా చేస్తే పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు.  
 
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్‌లను పుష్కలంగా వుంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఫ్రీ రాడికల్స్ గుండెను కాపాడుతుంది. బీట్రూట్ జ్యూస్ పిల్లల మెదడుకు రక్తసరఫరాను పెంచుతుందని.. ఇందులోని నైట్రేట్లు రక్తనాళాలలో అడ్డంకులను తొలగించి, మెదడుకు రక్తప్రసరణను కూడా అధికం చేస్తుంది. ఒకగ్లాసు బీట్రూట్ జ్యూస్ పిల్లల మెదడుకు ఎంతో మేలు చేస్తుంది. 
 
అలాగే ఒక గ్లాసు టమోటా రసం పిల్లల చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచటమే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది. టమోటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, లైకోపిన్‌లే ఇందుకు కారణమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాల పౌడర్‌తో చర్మం మెరిసిపోతుంది.. ఎలా?