Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడురోజుల్లో మంత్రిపదవి ఇస్తామని లాగేశారు... ఏదీ? మనిషే లేకుండా పోయారు

దివంగత నేత భూమా నాగిరెడ్డికి మూడురోజుల్లో మంత్రి పదవి ఇస్తామని ప్రలోభపెట్టి వైకాపా నుంచి ఫిరాయింపి చేసి మరీ పార్టీలోకి లాక్కున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒకటిన్నర సంవత్సరం పైగా భూమాకు పుర్ర చేయి చూపించి ఒత్తిడికి గురి చేశారని వైకాపా అధినేత వైఎస్

Advertiesment
Bhuma nagireddy
హైదరాబాద్ , బుధవారం, 15 మార్చి 2017 (04:32 IST)
దివంగత నేత భూమా నాగిరెడ్డికి మూడురోజుల్లో మంత్రి పదవి ఇస్తామని ప్రలోభపెట్టి వైకాపా నుంచి ఫిరాయింపి చేసి మరీ పార్టీలోకి లాక్కున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒకటిన్నర సంవత్సరం పైగా భూమాకు పుర్ర చేయి చూపించి ఒత్తిడికి గురి చేశారని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. భూమా పార్టీని వీడి వెళ్లాలనుకున్న రోజు పొరపాటు చేస్తున్నారు వెళ్లవద్దని నచ్చచెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించామని కానీ మంత్రి పదవి ఆశకు లోనై ఆయన టీడీపీలోకి వెళ్లారని జగన్ విచారం వ్యక్తం చే్శారు. జగన్ని విడిచి వెళ్లడం ఇష్టంలేదని కన్నీళ్లు పెట్టుకున్న వ్యక్తిని చంద్రబాబు ఆశ చూపించి లాగేశారని కానీ నమ్మి పార్టీలోకి వెళ్లిన వ్యక్తిని సంవత్సరం పాటు అలాగే ఉంచేశారని జగన్ విమర్శించారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే.
..
 
భూమా వైఎస్సార్‌సీపీని వీడి వెళ్లాలని అనుకుంటున్న రోజు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆయనతో మాట్లాడ్డానికి ఆయన ఇంటికి వెళ్లారు. ‘ఎందుకు వెళుతున్నారన్నా.. మీరు పొరబాటు చేస్తున్నారు’ అని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘నాకు మూడే మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పారు. పచ్చకండువా వేసుకోవడమే ఆలస్యం... వెంటనే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. అందుకే టీడీపీలోకి వెళుతున్నా’ అని సజ్జల, వైవీతో భూమా చెప్పారు. ‘జగన్‌ను విడిచిపెట్టి పోవడం ఇష్టం లేదు’ అని భూమా కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళితే మంత్రి పదవి ఎలా ఇస్తారని రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తే... చంద్రబాబు ఇస్తానన్నాడని నాగిరెడ్డి సమాధానమిచ్చారు. అలాంటి వ్యక్తిని సంవత్సరంపాటు అలాగే ఉంచేశారు. ప్రలోభాలు పెట్టినవాళ్లది ఎంత తప్పో, ఆ ప్రలోభాలకు లొంగిన వాళ్లది కూడా అంతే తప్పు. చంద్రబాబు గతంలో ఎన్టీ రామారావును ఏ రకంగా క్షోభకు గేురిచేసి గుండెపోటుతో చనిపోయేటట్లుగా చేశారో ఇప్పుడు భూమా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది.  
 
ఒక పార్టీ నుంచి గెలిచిన వారికి మరో పార్టీలో మంత్రి పదవి ఇవ్వరాదనేది ఇంగితం ఉన్న వారెవరికైనా తెలిసిన అంశం. పదో తరగతి చదివినోడికి కూడా ఈ విషయం తెలుస్తుంది. అందుకే భూమా దగ్గరకి మా వాళ్లు వెళ్లి ఆయనకు జ్ఞానోదయం కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చూపిన ఆశ ముందు మా వాళ్ల హితవు పని చేయలేదు. తెలంగాణలో టీడీపీ వారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చినపుడు చంద్రబాబు ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడారో అందరికీ తెలుసు. గవర్నర్‌ను తప్పు దోవ పట్టించారనీ, అందుకే గవర్నర్‌ తప్పు చేశారని అన్నారు కదా. ఆరోజు గవర్నర్‌ను తప్పుదోవ పట్టించిన పరిస్థితుల్లో ఆయన తప్పు చేశారు.
 
అక్కడ జరిగిన అదే తప్పును గవర్నర్‌ చేత రెండోసారి, మూడో సారి తప్పు చేయించాలంటే ఎవరూ చేయరు. ఒక పార్టీలో ఉన్న వారికి మంత్రిపదవి ఇవ్వాలంటే ఉన్న పార్టీకి రాజీనామా ఇచ్చి దానిని ఆమోదింప జేసుకున్న తరువాతనే మంత్రివర్గంలోకి తీసుకుంటారు. అలా జరగక పోతే ఇక ప్రజాస్వామ్యమనేదే ఉండదు. ఏ పార్టీ టికెట్‌ మీద గెలిచిన వాడైనా వచ్చి మంత్రి పదవి తీసుకోవడం ఏ మాత్రం ప్రజాస్వామ్య బద్ధం కాదు. 
 
స్పీకర్‌ మనవాడే... అధికారపక్షానికి చెందిన వాడే కాబట్టి ఏం చేసినా అనర్హత వేటు పడదు అంటే, అసలు ప్రజాస్వామ్యం ఉందనుకోవాలా... బతుకుతుందా.. ప్రజాస్వామ్యం బతకాలి అనంటే అందుకు కొన్ని విధానాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అంటూ జగన్ భూమా మన:క్షోభకు దారితీసిన పరిస్థితులను వాటి పర్యవసానాలను వివరించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిలప్రియకు మొదట ఫోన్ చేసింది మేమే. ఇప్పుడీ రాజకీయం ఏమిటి: జగన్ విచారం