Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

షియోమీ నుంచి Xiaomi Civi లాంఛ్.. స్పెసిఫికేషన్లు ఇవే..

షియోమీ నుంచి Xiaomi Civi లాంఛ్.. స్పెసిఫికేషన్లు ఇవే..
, బుధవారం, 29 సెప్టెంబరు 2021 (14:48 IST)
Xiaomi Civi
ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ షియోమీ తాజాగా షియోమి సీవీ (Xiaomi Civi) పేరుతో కొత్త సిరీస్​ను తీసుకొచ్చింది. ఈ సిరీస్​కు సంబంధించిన తొలి ఫోన్​ను చైనా మార్కెట్​లోకి విడుదల చేసింది. 
 
ప్రస్తుతానికి చైనాలో విడుదలైన ఈ ఫోన్​ త్వరలోనే భారత్​తో పాటు ఇతర దేశాల్లోకి వచ్చే అవకాశం ఉంది. యూత్‌ను టార్గెట్​గా చేసుకొని కెమెరా మీద ఎక్కువ ఫోకస్​ పెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో సీవీ సిరీస్​ను చాలా స్లిమ్​గా తయారు చేసినట్లు సమాచారం.
 
షియోమీ సీవీ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. షియోమీ సీవీ అమ్మకాలు చైనాలో సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభమవుతాయి. ఇది బ్లూ, బ్లాక్, పింక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
 
షియోమీ సీవీ స్పెసిఫికేషన్లు
షియోమీ సీవీ MIUI 12.5, ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్​పై పనిచేస్తుంది. ఇది 6.55 అంగుళాల ఫుల్-హెచ్‌డి+ OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 12GB ర్యామ్​, 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ అందుబాటులో ఉంటుంది. 
 
ఈ స్మార్ట్​ఫోన్​ స్నాప్‌డ్రాగన్ 778G SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. షియోమీ సీవీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌, 8 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కెమెరాలను అందించింది.
 
సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం 32 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాను చేర్చింది. షియోమీ సీవీ కనెక్టివిటీ ఆప్షన్లు పరిశీలిస్తే.. 5G, 4G ఎల్​టీఈ, వైఫై, బ్లూటూత్ v5.2, ఎన్​ఎఫ్​సీ, యూఎస్​బీ టైప్-సి, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి చేర్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జైల్లో భర్త.. ప్రియుడితో భార్య సరసాలు.. నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు