అగ్ని-V టెస్ట్ నిర్వహించడం భారత్‌కు ఇది తొలిసారి కాకపోయినా.. డ్రాగన్ దేశం చైనా ఈసారి మరింత ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ టెస్టుల తర్వాత భారత రక్షణ దళం అమ్ములపొదిలోకి ఈ ఖండాంతర అగ్ని క్షిపణి చేరనుంది. దీంతో భారత సాయుధ దళానికి మరింత బలం చేకూరినట్టవుతుంది. అసలు అగ్ని- V విషయంలో చైనా ఎందుకు ఆందోళన చెందుతోంది.
అగ్ని- V.. భారత తొలి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం). 5000 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఇది ఛేదించగలదు. దశాబ్దకాలం పాటు దీని తయారీ ప్రక్రియ జరిగింది. అనుకున్న సుదూర లక్ష్యాన్ని అగ్ని- V విజయవంతంగా ఛేదించిందని 2018 జనవరిలో నిర్వహించిన ఐదో పరీక్ష తర్వాత భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే, ఒకే ఏడాది రెండుసార్లు టెస్ట్ చేశాక సాయుధ దళాలకు అగ్ని- Vను అప్పగించాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. ఈ ఏడాది జూన్, డిసెంబర్లో క్షిపణి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అయితే కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇది ఆలస్యమైంది. అయితే తదుపరి టెస్టు సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదట్లో ఉంటుందని సమాచారం బయటికి వచ్చింది. అయితే మిసైల్‌కు ఇదే తొలి యూజర్ ట్రైల్స్ అని సమాచారం.