సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ వచ్చింది. ఇకపై వాట్సాప్‌లో డార్క్ మోడ్ ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆప్షన్ ద్వారా వాట్సాప్ చాట్ బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కలర్‌లోకి మారుతుంది. ఫలితంగా కంటికి ఎలాంటి ఇబ్బంది వుండదని వాట్సాప్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఇక యూజర్లు సెట్టింగ్స్‌లోని చాట్స్, థీమ్ ఆప్షన్‌లోకి వెళ్లి డార్క్ అనే ఫీచర్‌ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా వాట్సాప్‌లో డార్క్ మోడ్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై వాట్సాప్‌ను వాడుతున్న యూజర్లందరికీ ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇంకా వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలో వాట్సప్‌లో అడ్వాన్స్ సెర్చ్, బ్యాకప్ పాస్‌వర్డ్ ప్రొటెక్షన్, ఆటో డౌన్‌లోడ్ రూల్స్ ఫీచర్స్ రానున్నాయి.
వాట్సప్‌లో ఫార్వర్డ్ మెసేజెస్ కుప్పలుతెప్పలుగా వస్తుంటాయి. వీటిలో అవసరం లేని ఫోటోలు, వీడియోలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎక్కువగా ఫార్వర్డ్ అయ్యే ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, వాయిస్ మెసేజెస్ ఆటో డౌన్‌లోడ్ కాకుండా డిసేబుల్ చేసే ఆప్షన్ త్వరలో వాట్సప్‌లో రానుంది.