సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ట్వీట్టర్‌లో ఇక వాయిస్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది. ట్విట్టర్ సంస్థ తన బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విషయాన్ని చెప్పింది. స్క్రీన్‌పై ఉన్న వేవ్‌లెన్త్స్ ఐకాన్ ద్వారా యూజర్ల.. వాయిస్ ట్వీట్ చేయవచ్చు అని ఆ పోస్టులో తెలిపారు.
తాజా ఫీచర్‌తో ట్వీట్స్ ద్వారా మీ వాయిస్‌ను రికార్డు చేసుకోవచ్చు. ఒక సింగిల్ ట్వీట్‌లో.. సుమారు 140 సెకండ్ల వాయిస్‌ను అందుకునే విధంగా ఆ ఫీచర్‌ను డెవలప్ చేశారు. ట్విట్టర్ హోమ్‌పేజీపై ఓ కొత్త ఐకాన్‌ను యాడ్ చేశారు. అది మన వాయిస్ వేవ్‌లెన్త్‌ను గ్రహించి ట్వీట్ చేస్తుంది. అయితే ప్రస్తుతానికి ఆ ఫీచర్ టెస్టింగ్ దశలోనే ఉందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ కొత్త ఫీచర్ తొలుత కేవలం యాపిల్‌లోని ఐఓఎస్ ఫ్లాట్‌ఫామ్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది కూడా కొంతమందికి మాత్రమే ఈ అవకాశం ఇవ్వనున్నారు. రానున్న రోజుల్లో వాయిస్ ఫీచర్‌ను మరికొంత మంది ఐఓఎస్ యూజర్లకు ఇవ్వనున్నారు.