Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అభిమానులు అమాయకులు.. రాజకీయ నేతలు రాక్షసులు..పూనమ్ కౌర్

Advertiesment
అభిమానులు అమాయకులు.. రాజకీయ నేతలు రాక్షసులు..పూనమ్ కౌర్
, ఆదివారం, 7 జూన్ 2020 (12:06 IST)
నటి పూనమ్‌ కౌర్‌ పెట్టిన కొన్ని ట్వీట్లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. సినీ తారల జీవితంలో ట్రోలింగ్‌ కూడా భాగమని, వాటిని పట్టించుకోకూడదని తాజాగా పూనమ్ వ్యాఖ్యానించారు. అభిమానులు అమాయకులని, రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వ్యక్తులు వాళ్లని ప్రేరేపిస్తున్నారని అన్నారు.
 
సరైన కారణం లేకుండా చాలామంది తన గురించి తప్పుగా ప్రచారం చేశారని. అసభ్యంగా మాట్లాడారని.. కానీ ఇప్పటివరకు తాను ఏ ఒక్క అభిమానిపై ఫిర్యాదు చేయలేదు. అభిమానులు అమాయకులని నమ్ముతాను. కొంతమంది మధ్యవర్తులు తమ స్వలాభం కోసం అభిమానులను ఇలాంటి విషయాల్లో ప్రేరేపిస్తున్నారు. అందుకే తనను ఇబ్బంది పెట్టిన వ్యక్తులపై మాత్రమే తాను ఫిర్యాదు చేశాను. 
 
సోషల్‌మీడియాలో జరిగే వార్స్‌కి అభిమానులను నిందించొద్దు. తన అభిమానులు వేరే వ్యక్తులతో అసభ్యంగా ప్రవర్తించాలని ఏ నటుడు లేదా నటీ కోరుకోదు. సినీ తారల జీవితంలో ట్రోలింగ్‌ ఒక భాగం. బాధితురాలిగా మార్చేందుకే ట్రోలింగ్‌ చేస్తారు. బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని వదిలేసి మనం ప్రయాణం సాగించాలని మీరా చోప్రాను ఉద్దేశించి తెలిపింది. 
 
'రాజకీయ లబ్ధిలో భాగంగా ఓ నటుడిపై బురదజల్లడం కోసం ఫేక్‌ అకౌంట్లు సృష్టించి అభిమానులమని చెప్పుకుంటున్నారేమో మనకి తెలియదని హితను  పలికింది. మన ఇండస్ట్రీ రాజకీయ పార్టీలతో లింకై ఉందని గ్రహించాలని.. అభిమానులు అమాయకులు. కొంతమంది రాజకీయ నేతలు రాక్షసులు. అలాంటి వాళ్లే ఇలాంటివి చేస్తారని పూనమ్‌ కౌర్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాతో డబ్బుల్లేవ్.. సీరియళ్లలో నటించే అన్నాచెల్లెలు ఆత్మహత్య