Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో? వారికి ఈ హెచ్చరికా.....

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వారు తీసుకోవలసిన జాగ్రత్తలు. కొన్ని డివైజ్‌లు, మెుబైల్ యూజర్లు స్టోర్ చేసుకున్న ఫోటోలను వారి అనుమతి లేకుండా స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర కాంటాక్ట్‌లకు పంపుతున్నట్

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో? వారికి ఈ హెచ్చరికా.....
, మంగళవారం, 3 జులై 2018 (17:40 IST)
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వారు తీసుకోవలసిన జాగ్రత్తలు. కొన్ని డివైజ్‌లు, మెుబైల్ యూజర్లు స్టోర్ చేసుకున్న ఫోటోలను వారి అనుమతి లేకుండా స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర కాంటాక్ట్‌లకు పంపుతున్నట్లుగా సమాచారం అందింది. శాంసంగ్ మెసేజస్ కలిగి ఉన్నవారికి ఈ సమస్య తలెత్తిన్నట్లు గిజ్‌మోడో తొలుత రిపోర్టు చేసింది.
 
ఫైల్స్‌ను పంపుతున్నప్పటికి దాన్ని యూజర్లకు కూడా తెలుపడం లేదని రిపోర్టు తెలియజేసింది. ఈ శాంసంగ్ ఫోన్లలో శాంసంగ్ మెసేజస్ అనేది ఒక డిఫాల్ట్ మెసేజింగ్ యాప్. దీనిలోని బగ్ కారణంగా ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలిసింది. గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ డివైజ్‌లు దీని బారిన పడ్డాయి. కేవలం ఈ రెండు మోడల్స్ మాత్రమే ఈ సమస్య పరిమితం కాలేదని వెర్జ్ రిపోర్టులో వెల్లడైంది.
 
ఈ రిపోర్టులు తమ దృష్టికి వచ్చాయని, తమ టెక్నికల్ టీమ్స్ దీన్ని విచారిస్తున్నరని శాంసంగ్ ప్రకటనను విడుదల చేసింది. దీని బారిన పడిన కస్టమర్ల 1-800-శాంసంగ్ వద్ద తమను డైరెక్ట్‌గా చేయవలసినదిగా శాంసంగ్ కోరింది. అనుమతి లేకుండా ఫోటోలను, డేటాను కాంటాక్ట్‌లకు పంపే బగ్ బారిన పడకుండా ఉండేందుకు శాంసంగ్ మెసేజస్ అనుమతులను యూజర్లు ఉపసంహరించుకోవచ్చని శాంసంగ్ తెలియజేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్ సీఎంను ఇంట్లోకి అడుగుపెట్టనివ్వను : తేజ్ ప్రసాద్ యాదవ్