Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టాయ్‌లెట్‌లో స్మార్ట్‌ఫోనా? అబ్బే..?

సోషల్ మీడియా పుణ్యంతో స్మార్ట్ ఫోన్లపై మోజు ఏమాత్రం తీరట్లేదు. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. చేతిలో ఫోన్ లేకపోతే ఏదో వేరొక లోకంలో వున్నట్లు చాలామంది భావిస్తున్నారు. తిండిలేక ఉ

Advertiesment
టాయ్‌లెట్‌లో స్మార్ట్‌ఫోనా? అబ్బే..?
, బుధవారం, 27 జూన్ 2018 (11:44 IST)
సోషల్ మీడియా పుణ్యంతో స్మార్ట్ ఫోన్లపై మోజు ఏమాత్రం తీరట్లేదు. ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. చేతిలో ఫోన్ లేకపోతే ఏదో వేరొక లోకంలో వున్నట్లు చాలామంది భావిస్తున్నారు. తిండిలేక ఉంటామేమో కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా మాత్రం ఉండేది లేదని తేల్చి చెప్తున్నారు. స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం వుండలేక.. చివరికి టాయ్‌లెట్‌కి వెళ్లేట‌ప్పుడు కూడా స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్తున్నారు. 
 
అయితే స్మార్ట్ ఫోన్లను బాత్రూమ్ లోపలికి తీసుకెళ్తే మాత్రం వ్యాధుల బారిన పడక తప్పదని లండన్ మెట్రోపాలిటన్ యూనివర్శిటికీ చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అలా స్మార్ట్ ఫోన్లను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లడం ద్వారా డయేరియా, మూత్ర సంబంధ వ్యాధుల బారిన ప‌డే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
టాయ్‌లెట్‌లో ఉండే సింకులు, న‌ల్లాలు, బేసిన్ల మీద ఇశ్చిరియా కొలై, క్లాస్ట్రీడియం డిఫిచిలే వంటి రోగాలు క‌లిగించే బాక్టీరియా ఉంటుంద‌ని, టాయ్‌లెట్‌కి మొబైల్ తీసుకెళ్లి ఆ బేసిన్ల‌ను ముట్టుకున్న చేతుల‌తోనే మ‌ళ్లీ మొబైల్ ప‌ట్టుకోవ‌డం వ‌ల్ల బాక్టీరియా ఫోన్ మీద‌కి చేరుకుంటుంది. అలా చేరుకోవడం ద్వారా ఫోన్‌లోని బ్యాక్టీరియా సులభంగా శరీరంలోకి చేరుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 
స్మార్ట్ ఫోన్లను బాత్రూమ్‌ల్లో వాడటం ద్వారానే కాకుండా బ్యాగులను శుభ్రం చేయకపోవడం, బూట్లను ఇంట్లో ధరించడం, టీవీ రిమోట్, కంప్యూటర్ కీబోర్డు, మౌస్‌లను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా రోగాల బారిన పడే అవకాశం వుందని.. కాబట్టి నిత్యావసర వస్తువులను అప్పుడప్పుడు శుభ్రం చేసుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు  సూచిస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'సుఖ' సంసారం పగటి పూటే ఎందుకు చేయాలి?