Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గెలాక్సీ ఫోల్డబుల్స్ కోసం ముందస్తు నమోదును ప్రారంభించిన సామ్‌సంగ్

Advertiesment
Samsung New Foldables

ఐవీఆర్

, సోమవారం, 30 జూన్ 2025 (16:31 IST)
గురుగ్రామ్: తమ భావితరపు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను జూలై 9న న్యూయార్క్‌లో సామ్‌సంగ్ విడుదల చేయనుంది. భావితరపు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు కొత్త ఏఐ శక్తితో వస్తాయి. వీటికి అద్భుతమైన హార్డ్‌వేర్ మద్దతు అందిస్తుంది. అధికారికంగా ఈ ఫోల్డబల్స్‌ను విడుదల చేయటానికి ముందుగానే , భారతదేశంలోని కస్టమర్‌లు రూ. 2000 టోకెన్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా తదుపరి తరం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు. సామ్‌సంగ్ భావితరపు  ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న కస్టమర్‌లు ఈ ఉపకరణాలను కొనుగోలు చేయడంపై రూ. 5999 వరకు విలువైన ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. వారు ముందస్తు డెలివరీని కూడా పొందటానికి అర్హులవుతారు.
 
కస్టమర్‌లు సామ్ సంగ్ డాట్ కామ్, సామ్‌సంగ్ ఎక్స్ క్లూజివ్ స్టోర్స్, అమేజాన్, ఫ్లిప్ కార్ట్, భారతదేశం అంతటా ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లను సందర్శించడం ద్వారా సామ్‌సంగ్ భావితరపు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవచ్చు. మెరుగైన పనితీరు, స్పష్టత అందించే  కెమెరాలు, కనెక్ట్ అయి ఉండటానికి స్మార్ట్ మార్గాలు వంటి ప్రజలకు నిజంగా అవసరమైన వాటి అంశాల చుట్టూ సామ్‌సంగ్ కొత్త ఉపకరణాలను రూపొందించింది. ప్రజలు వాటితో ఎలా సంభాషిస్తారనే దాని గురించి, గెలాక్సీ ఏఐ పరికరాలు చేయగలిగే దానికంటే మించి ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి