Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం.. కానీ ఐయూసీ ఛార్జీలుంటాయ్

ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం.. కానీ ఐయూసీ ఛార్జీలుంటాయ్
, బుధవారం, 1 జులై 2020 (13:38 IST)
రిలయన్స్ జియో కొత్త పథకాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. గత ఏడాది ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జ్‌లను వడ్డించిన జియో.. వినియోగదారులకు ఊరట నిచ్చేలా.. ఫెయిర్ యూసేజ్ పాలసీ లిమిట్ (ఎఫ్‌యూపీ) కింద కొత్త ప్రీపెయిడ్  ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం అందిస్తోంది. 
 
అయితే ఈ పరిమితి అయిపోయాక ఇతర నెట్ వర్క్‌లకు చేసే కాల్స్‌పై 6 పైసల ఐయూసీ చార్జీలను జియో వసూలు చేయనుంది. రూ.2599ల ప్రీపెయిడ్ వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్. ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం లభ్యం. రోజుకు 2జీబీ డేటాతోపాటు 10జీబీ డేటా బోనస్‌ అదనంగా అందిస్తుంది. 
 
అంటే సంవత్సరానికి మొత్తం 740 జీబీ  డేటాను  వాడుకోవచ్చు. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు పొందవచ్చు. ఇలానే ఇతర వార్షిక ప్లాన్‌లపై కూడా జియో ఎఫ్‌యూపీని అందుబాటులోకి తెచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాపై కారాలు మిరియాలు నూరుతున్న డోనాల్డ్ ట్రంప్