Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాపై కారాలు మిరియాలు నూరుతున్న డోనాల్డ్ ట్రంప్

Advertiesment
చైనాపై కారాలు మిరియాలు నూరుతున్న డోనాల్డ్ ట్రంప్
, బుధవారం, 1 జులై 2020 (13:32 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు కారణభూతంగా ఉన్న చైనాపై అగ్రరాజ్యం అమెరికా గుర్రుగా ఉంది. ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అయితే కారాలు మిరియాలు నూరుతున్నారు. దీనికి కారణం కరోనా వైరస్. తమ దేశంలో ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టలేక వైద్యులు సైతం చేతులెత్తేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా పుట్టినిల్లు చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా విజృంభణ ప్రపంచవ్యాప్తంగా అధికమైందన్నారు. అమెరికాతో పాటు ప్రపచంలోని అన్ని దేశాలకు ఈ వైరస్‌ ఎంతో నష్టాన్ని తీసుకొచ్చిందని ట్రంప్ చెప్పారు. 
 
ప్రస్తుతం చైనా మీద తనకున్న కోపం అంతకంతకు పెరుగుతోందన్నారు. అమెరికాలో కరోనా వ్యాప్తిని అదుపు చేసే పరిస్థితులు లేకపోవడంతో అక్కడి వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణ సాధించలేమని అమెరికా‌ వైద్యులు ట్రంప్‌కు తెలిపారు.
 
ఈ నేపథ్యంలోనే చైనాపై ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. కరోనా వైరస్‌ను వూహాన్ దాటకుండా చేసిన చైనా... ఈ వైరస్‌ను మాత్రం తమ దేశాన్ని దాటించి ప్రపంచానికి ఎలా వ్యాప్తి చేసిందని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. చైనా ఉద్దేశ్యపూర్వకంగానే ఈ పని చేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. 
 
ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రదర్శించిన తీరు కూడా సరికాదని ఆయన మండిపడుతున్నారు. ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓకు అమెరికా ఇచ్చే నిధులను కూడా నిలిపివేసిన విషయం తెల్సిందే. ఇపుడు చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓలా డ్రైవర్లకు కొత్త ఫీచర్.. అదేంటంటే?