Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిట్రాన్ బ్లూ టూత్ కాలింగ్‌ ఉన్న స్మార్ట్‌వాచ్‌, ధర ఎంతో తెలుసా?

Advertiesment
watch
, శనివారం, 3 సెప్టెంబరు 2022 (22:58 IST)
పిట్రాన్, భారతదేశం యూత్ కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న, మరియు ప్రముఖ యాక్సెసరీస్ బ్రాండ్, స్మార్ట్‌వాచ్ అవసరాలు అన్నిటిని కవర్ చేసే పూర్తి-లోడెడ్, స్టైలిష్ స్మార్ట్‌వాచ్‌ను పరిచయం చేసింది. పోటి కంపెనీల స్మార్ట్ వాచ్‌ ధరలో కొంతకే బ్లూటూత్ కాలింగ్- రిసీవింగ్ ఫంక్షన్‌ను అందిస్తుంది.
 
అల్ట్రా-స్లిమ్, లైట్ డిజైన్, సులభంగా ఉపయోగించగల హెల్త్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌లతో, పిట్రాన్ ఫోర్స్ X10 పవర్‌ వస్తుంది. తద్వారా వినియోగదారులు స్టైల్‌‌తో పాటు వారి ఆరోగ్యాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. తేలికగా ఎర్గోనామిక్‌గా కనపడే విధంగా తయారు చేయబడిన, ఫోర్స్ X10 అత్యద్భుత గ్రాఫిక్స్, యాంప్లిఫైడ్ బ్రైట్‌నెస్‌ని అందించే 1.7" పెద్ద హెచ్ డి ఫుల్-టచ్ కలర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అందమైన 2.5D కర్వ్డ్ గుండ్రని డయల్ ప్రీమియం అల్లాయ్ మెటల్ కేసింగ్‌లో ఉంటుంది. పురుషులు, మహిళలు- యుక్తవయస్కులకు అనువుగా ధరించగలిగిన యాక్సెసరీ వలే పగలు- రాత్రంతా పరిపూర్ణంగా మరియు సౌకర్యవంతంగా ఉండేలా చూసేందుకు ఫోర్స్ X10 అన్ని విధాలుగా పరీక్షించబడింది.
 
ప్రారంభోత్సవం గురించి, పిట్రాన్ వ్యవస్థాపకుడు- సిఈఓ అయిన శ్రీ అమీన్ ఖ్వాజా మాట్లాడుతూ, “మేము చూపుకు ఆకర్షణీయంగా డబ్బుకు విలువనిచ్చే ప్రాడక్టులకు అత్యంత ప్రాధాన్య యువత బ్రాండ్‌గా మారాము. మా సరికొత్త ఫోర్స్ X10 స్మార్ట్‌వాచ్‌తో, మేము చెప్పుకోదగిన ధర వద్ద ప్రజలకు అందుబాటులో ఉండేలా స్మార్ట్ వేరబుల్స్ విభాగంలో గ్రౌండ్ బ్రేకింగ్ టెక్‌ని తయారు చేస్తున్నాము. మా ఫోర్స్ X10 వినూత్న సాంకేతికతను జెన్ జెడ్ మరియు పెద్దల కోసం రూపొందించిన ఐకానిక్ డిజైన్ సౌందర్యంతో అందుబాటులోకి వస్తున్నది, ఈ రకమైన వేరబుల్స్ ఇంతకు ముందెన్నడూ చూడని ధరతో ఆరోగ్యం, ఫిట్‌నెస్ & ఫ్యాషన్ లక్ష్యాలను నెరవేర్చే సరైన ప్రాడక్ట్‌గా మారుతుంది.
 
ఇందులో స్టైల్ మరియు స్మార్ట్‌నెస్  ఖచ్చితంగా కలిపి వస్తుంది, ఫోర్స్ X10 దాని 8 యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్‌లతో ప్రతి అడుగు, ప్రతి ల్యాప్, ప్రతి స్టాట్‌ను ట్రాక్ చేస్తుంది, తద్వారా మీరు మీ యొక్క ఫిట్‌నెస్ లక్ష్యాలను చేరుకుంటారు. స్మార్ట్ వాచ్ వినియోగదారులు వారి బ్లడ్ ఆక్సిజన్ మరియు హృదయ స్పందన రేటును నిజ-సమయ ప్రాతిపదికన పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది. పిట్రాన్ ఫోర్స్ X10 కూడా నీటి నుంచి అదనపు రక్షణ కోసం IP68 రేటింగ్‌ తో వస్తుంది.  ఇతర ఫీచర్లు రైజ్ & వేక్ డిస్‌ప్లే, బ్లూటూత్ ద్వారా కెమెరా కంట్రోల్, సెడెంటరీ రిమైండర్, మ్యూజిక్ కంట్రోల్ మరియు మల్టిపుల్ వాచ్ ఫేస్‌లు వస్తున్నాయి. ఈ వాచ్ కేవలం రూ. 1499.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కూతురిపై పెంపుడు తండ్రితో అత్యాచారం చేయించి... పిండాన్ని అమ్మేస్తోంది..