భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ విడుదలైంది. పోకో నుంచి M6 Pro 5G అనే మోడల్ మార్కెట్లోకి వచ్చేసింది. భారత మార్కెట్లోకి ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పోకో కూడా ఎం6 ప్రో 5జీని మార్కెట్లోకి ఆవిష్కరించింది.
ఈ మోడల్ ఫీచర్లు, ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం. కొత్తగా ప్రారంభించిన Poco M6 Pro 5G రెడ్‌మి 12 5G, రీబ్రాండెడ్ వెర్షన్ లాగా ఉంది. ఇది 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో 50 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా వస్తోంది.
ఈ గాడ్జెట్‌లో Snapdragon 4 Gen 2 SoC ప్రాసెసర్ ఉంది. Android 13 ఆధారిత MIUI 14 సాఫ్ట్‌వేర్‌పై ఈ స్మార్ట్ పోన్ నడుస్తుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, పవర్ బ్లాక్ కలర్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఫీచర్స్..
5,000 mAh బ్యాటరీ సెటప్
8W ఛార్జింగ్ సపోర్ట్
Poco స్టోరేజ్ RAM కోసం 2 ఎంపికలను అందిస్తోంది.
ఇందులో 4GB RAM, 64GB నిల్వను అందించే బేస్ వెర్షన్ ధర రూ.10,999 కాగా,
6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999 లకు లభిస్తుంది.