Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో ప్రైమ్ వినియోగదారులకు మరో ఏడాది ఫ్రీ... పొందేందుకు ఏం చేయాలి?

జియో మరోసారి తమ జియో ప్రైమ్ వినియోగదారులైన 175 మిలియన్ మందికి మరో బొనాంజా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31, 2018 వరకూ ఎవరైతే జియో ప్రైమ్ సభ్యత్వాన్ని కలిగి వున్నారో వారికి మరో ఏడాది పాటు కాంప్లిమెంటరీ ప్రైమ్ బెనిఫిట్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీ

Advertiesment
జియో ప్రైమ్ వినియోగదారులకు మరో ఏడాది ఫ్రీ... పొందేందుకు ఏం చేయాలి?
, శుక్రవారం, 30 మార్చి 2018 (20:45 IST)
జియో మరోసారి తమ జియో ప్రైమ్ వినియోగదారులైన 175 మిలియన్ మందికి మరో బొనాంజా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31, 2018 వరకూ ఎవరైతే జియో ప్రైమ్ సభ్యత్వాన్ని కలిగి వున్నారో వారికి మరో ఏడాది పాటు కాంప్లిమెంటరీ ప్రైమ్ బెనిఫిట్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి ఎలాంటి అదనపు చార్జీలు లేవు. తమ వ్యవస్థాపక సభ్యులైన వినియోగదారులకు ఈ సేవలను మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఐతే కొత్తగా చేరే యూజర్లు మాత్రం ఏడాది సభ్యత్వమైన రూ. 99ని చెల్లించాల్సి వుంటుంది. 
 
గత ఏడాది కాలంలో ప్రైమ్ కస్టమర్లు జియో పట్ల తమ అనుభవాలను పరిశీలిస్తే...
 
ఇండస్ట్రీలోనే బెస్ట్ టారిఫ్‌లు
నాణ్యమైన సేవలందించే అత్యుత్తమమైనదిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది జియో.
ఇడిఎంవి ప్రకారం జియో ప్రైమ్ యూజర్లకు నిత్యం 20 నుంచి 50 శాతం అందిస్తూనే వుంది.
 
కాంప్లిమెంటరీగా క్రింది సేవలు
550కి పైగా టీవీ ఛానళ్లు
6000కి పైగా సినిమాలు
లక్షల వీడియోలు, టీవీ షోలు
1.4 కోట్లకు పైగా పాటలు
5 వేలకు పైగా పత్రికలు
500కి పైగా న్యూస్ పేపర్స్
 
మై జియో - డిజిటల్ గేట్‌వే
సింగిల్ క్లిక్‌తో 24*7 సెల్ఫ్ సర్వీస్ ఎకౌంట్ మేనేజ్మెంట్
అన్ని జియో అప్లికేషన్లకు అనుమతి
బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లకు అనుమతి
 
జియో కస్టమర్లకు మాత్రమే ప్రత్యేకమైన సమాచారం
జియో టీవీలో ప్రత్యేకంగా వింటర్ ఒలింపిక్స్ 2018
జియో టీవీలో నిదహాస్ క్రికెట్ ట్రోఫీ 2018
జీయో టీవీలో కరబో కప్ ప్రత్యేకంగా
 
ఇంకా మనీ కాంట్ బై క్రింద అమితాబ్ బచ్చన్‌తో జియో కెబీసి ప్లే. సెలబ్రీటీలు, క్రీడా వ్యక్తులతో చిట్ చాట్. లైవ్ షోలు. ఇంకా మరెన్నో.
 
ప్రైమ్ జియో బెనిఫిట్స్ పొందడమెలా?
ఇప్పటికే జియో ప్రైమ్ సభ్యత్వం వున్నవారు( మార్చి 31, 2018కి ముందుగా లేదా అదేరోజు)
స్టెప్ 1. డౌన్లోడ్ మై జియో
స్టెప్ 2. మరో 12 నెలలకు కాంప్లిమెంటర్ సభ్యత్వం కావాలంటూ తెలపాలి.
స్టెప్ 3. జియో ప్రైమ్ ప్రయోజనాలతో ఎంజాయ్ చేయండి.
 
ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే.
 
కొత్తగా జియో ప్రైమ్ సభ్యులకు ( ఏప్రిల్ 1, 2018న కానీ ఆ తర్వాత కానీ) రూ. 99ని జియో ప్రైమ్ సభ్యత్వం కోసం చెల్లించాలి. జియో ప్రైమ్ సభ్యత్వం ద్వారా జియో ఇచ్చే ప్రోగ్రామ్స్, ఆఫర్లు పొందే అవకాశం వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సినీ నటి...