గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు అక్టోబర్ 5 నుంచి ఫ్లిఫ్‌కార్ట్‌లో ఆర్డర్‌కు రానున్నాయి. గూగుల్ నెక్ట్స్ జెన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోలను అక్టోబర్ నాలుగో తేదీన మేడ్ బై గూగుల్ పేరిట జరిగే కార్యక్రమంలో గూగుల్ ఆవిష్కరించనుంది.
ఈ గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఆండ్రాయిడ్ 14తో వచ్చే అవకాశం ఉంది. టెన్సర్ జీ3 ప్రాసెసర్‌ను వినియోగించినట్లు సమాచారం.
Google Pixel-8 4485 ఎంఏహెచ్ బ్యాటరీ, 24 డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండనుంది. పిక్సెల్ 8 సిరీస్ 699 డాలర్ల వద్ద లాంచ్ చేసే వీలుంది.
అలాగే.. Google Pixel 8 Proలో 4950 ఎంఏహెచ్ బ్యాటరీ, 27 డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండనుంది. పిక్సెల్ 8 ప్రో 999 డాలర్ల ధర వద్ద లాంచ్ కావచ్చు.