Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిక్ టాక్‌కు పోటీగా గూగుల్.. టాంగి యాప్ వచ్చేసింది.. తెలుసా?

టిక్ టాక్‌కు పోటీగా గూగుల్.. టాంగి యాప్ వచ్చేసింది.. తెలుసా?
, శుక్రవారం, 31 జనవరి 2020 (14:54 IST)
టిక్ టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2019లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌ల‌లో టిక్ టాక్ రెండోస్థానం సంపాదించడం విశేషం. దీనిని బీట్ చేయడానికి గూగుల్ ప్రస్తుతం సిద్ధమైంది. తాజాగా గూగుల్ షార్ట్ - ఫార్మ్ వీడియో టాంగి యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ప్రయోగాత్మకంగా సామాజిక వీడియోలను షేర్ చేయగలదు. 
 
టాంగి యాప్.. ఇంక్యుబేటర్ ఏరియా 120 నుంచి అభివృద్ధి చేయబడింది. ప్రస్తుతం ఈ యాప్ స్టోర్, టాంగిడాక్‌కోలో అందుబాటులో ఉంచింది. ప్రతి రోజు కొత్త విషయాలను త్వరగా డీఐవై వీడియోలతో తెలుసుకోవడానికి ఈ యాప్ ఎంతగానో ఉపయోకరంగా ఉంటుందని గూగుల్ వెల్లడించింది. 
 
ప్రతి రోజు కొత్త విషయాలను తెలుసుకోవడానికి అవకాశం ఉందని, కళాత్మకంగా, వంటలు, స్టైల్ వంటి ఇతర అంశాలను 60 సెకన్లలోపు రికార్డు చేసి షేర్ చేయవచ్చని టాంగి యాప్ వ్యవస్థాపకులు తెలిపారు. ఇవి 60 సెకన్ల లాంగ్ వీడియోలు కలిగి ఉంటాయి. తక్కువ వ్యవధి గల వీడియోలను కూడా అప్ లోడ్ చేయవచ్చు. 
 
అలాగే గూగుల్ టాంగి యాప్ ఆపిల్ యాప్ స్టోర్ ఐఓఎస్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రం అందుబాటులో లేదు. ప్రస్తుతానికి అప్ లోడ్ చేసే సామర్థ్యం అందరికీ అందుబాటులో లేదని గూగుల్ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏమిటీ జగన్మాయ... అలా చేస్తే పెన్షన్లు పెరగాలి కదా? తగ్గడమేంటి?