Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గెలాక్సీ ఏ16 5జి మొదటి ఏ సిరీస్ ఫోన్ త్వరలో విడుదల

Galaxy A16 5G

ఐవీఆర్

, గురువారం, 10 అక్టోబరు 2024 (23:44 IST)
భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, త్వరలో తమ గెలాక్సీ ఏ16 5జి స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. గెలాక్సీ ఏ16 5జి 6 తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల భద్రతా నవీకరణలను అందించడం ద్వారా మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ16 5జి వినియోగదారులకు అసాధారణమైన విలువను అందిస్తూనే ఈ విభాగాన్ని పునర్నిర్వచించే ఫీచర్లను సైతం అందిస్తుంది.
 
గెలాక్సీ ఏ16 5జి ప్రీమియం గెలాక్సీ ఏ -సిరీస్ డిజైన్‌ను 'కీ ఐలాండ్' సౌందర్యంతో అలంకరించడానికి సిద్ధంగా ఉంది. కొత్త గ్లాస్టిక్ బ్యాక్ ప్యాటర్న్, పెద్ద డిస్‌ప్లే, సన్నటి బెజెల్స్‌తో జతచేయబడి, గెలాక్సీ ఏ16 5జి ని నిజంగా లీనమయ్యే వినోద పరికరంగా మారుస్తుంది, ఇది దృశ్య కంటెంట్‌ను ప్రసారం చేయడానికి సరైనది. గెలాక్సీ ఏ16 5జి గోల్డ్, లైట్ గ్రీన్, బ్లూ బ్లాక్ అనే మూడు అద్భుతమైన రంగులలో అందుబాటులో ఉండనుంది.
 
తమ విభాగంలో సాటిలేని రీతిలో 6 తరాల ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 6 సంవత్సరాల భద్రతా అప్‌డేట్‌లను అందించడం ద్వారా, గెలాక్సీ ఏ16 5జి భారతదేశ స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో విలువ ప్రతిపాదనను పునర్నిర్వచించటానికి, మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లలో సాటిలేని అనుభవాన్ని అందించడానికి నిర్దేశించబడినది, వినియోగదారులకు చాలాకాలం పాటు సరికొత్త ఫీచర్లను ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. 
 
నీరు, ధూళి నిరోధకత కోసం ఐపి 54 రేటింగ్‌ను అందించే మొదటి మధ్య-శ్రేణి గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ ఏ16 5జి నిలుస్తుంది. పిన్‌లు మరియు పాస్‌వర్డ్‌లతో సహా అవసరమైన డేటాను భద్రపరచడానికి ఇది ‘నాక్స్ వాల్ట్ చిప్‌సెట్’తో వస్తుంది. ఇది తన సాటిలేని మన్నికకు అదనపు ఆకర్షణలు  జోడిస్తూ, సామ్‌సంగ్ గెలాక్సీ ఏ16 5జి అద్భుతమైన చిత్రాలను, విశాలమైన ప్రకృతి దృశ్యాలను ఒడిసిపట్టటానికి రూపొందించబడిన అల్ట్రా వైడ్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ వంటి వైవిధ్యమైన ఫీచర్లతో వస్తుంది. గెలాక్సీ ఏ16 5జి  అసాధారణమైన కెమెరా సామర్థ్యాలను అందించే గెలాక్సీ ఏ సిరీస్ యొక్క గొప్ప వారసత్వాన్ని నిర్మించింది, వినియోగదారులు మునుపెన్నడూ లేని విధంగా తమ సృజనాత్మకతను వ్యక్తీకరించడానికి అనుమతిస్తుంది. దాని ఆకట్టుకునే కెమెరా సిస్టమ్‌తో పాటు, శక్తివంతమైన సూపర్ అమోలెడ్  డిస్‌ప్లే అద్భుతమైన రంగులు మరియు లోతైన కాంట్రాస్ట్‌లతో వీక్షణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
 
అదనంగా, అప్‌గ్రేడ్ చేయబడిన మీడియాటెక్ ప్రాసెసర్ హైపర్-ఫాస్ట్ కనెక్టివిటీ, అధిక-పనితీరు గల మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలను అలాగే గొప్ప గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఏ16 5జి దాని డిఫెన్స్ గ్రేడ్ నాక్స్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌తో వస్తుంది, ఇది ఆటో బ్లాకర్, సెక్యూర్ ఫోల్డర్, ప్రైవేట్ షేర్, పిన్ యాప్ మొదలైన ఫీచర్లను అందించడంతోపాటు వినియోగదారుల వ్యక్తిగత డేటాను కాపాడడానికి మరియు అనధికార మూలాలు, మాల్వేర్ మరియు నుంచి రక్షణ అందిస్తూనే ఏదైనా హానికరమైన చర్య నిరోధించడానికి వీలు కల్పిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో దువ్వాడ-దివ్వెల రీల్స్.. కేసు నమోదు చేసిన పోలీసులు