Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి దుస్తులతో శోభనం గదిలోకి వధువు.. మంచం మొత్తం పువ్వులు.. ఎక్కడ పడుకోవాలి?

పెళ్లి దుస్తులతో శోభనం గదిలోకి వధువు.. మంచం మొత్తం పువ్వులు.. ఎక్కడ పడుకోవాలి?
, శుక్రవారం, 30 జులై 2021 (17:56 IST)
bride
సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. కానీ అందులో కొన్ని మాత్రం జనాల దృష్టిని ఆకర్షిస్తాయి. అటువంటి వాటిని జనాలు చూడటమే కాకుండా.. ఇతరులకు కూడా షేర్ చేస్తారు. అందుకే అవి వైరల్‌గా మారుతుంటాయి. 
 
తాజాగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చివరి వరకు చూసిన జనాలు చాలా నవ్వుకుంటున్నారు. ఇలాంటి ప్రశ్న కూడా అడుగుతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియోను.. dulhaniyaa అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.
 
ఆ వీడియోలో ఓ అమ్మాయి.. పెళ్లి దుస్తులతో శోభనం గదిలోకి ప్రవేశిస్తుంది. అప్పటికే అక్కడ గది మొత్తం చాలా అందంగా డెకరేట్ చేసి ఉంచుతారు. అలాగే బెడ్ మొత్తం రకరకాల పూలతో కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు. అయితే వధువు మాత్రం గదికి వచ్చి షాక్ అవుతుంది. 
 
గదిని, మంచాన్ని పూలతో అలకరించడం చూసిన ఆమె.. ఎక్కడ పడుకోవాలని అడుగుతుంది..?. ఇది చూసిన జనాలు తెగ నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత వీడియో ఓ వ్యక్తి నిరాశతో ఉన్నట్టుగా చూపిస్తారు. అంటే ఆ అమ్మాయి చెప్పిన సమాధానం అతని శ్రమకు మొత్తం గుర్తింపు లేకుండా చేసిందనే అర్థం వచ్చేలా వుంది.
 
అయితే ఇది నిజంగానే జరిగిందా..?, లేక ఫన్ కోసం ఈ వీడియోను చిత్రీకరించారా అనేది తెలియదు. అయినప్పటికీ యువతి అడిగిన ప్రశ్న చాలా మందిని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు కూడా తమైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు చాలా మంచి ప్రశ్న అడిగింది అని కామెంట్స్ పెట్టగా, చాలా మంది డిఫరెంట్ ఏమోజీస్‌తో స్పందిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగష్టులో బ్యాంకు సెలవులు : ఖాతాదారులకు అలెర్ట్