Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి డిస్కవరీ ప్లస్

Advertiesment
Discovery plus
, గురువారం, 25 మార్చి 2021 (22:36 IST)
జియో ఫైబర్ యూజర్లకు డిస్కవరీ ప్లస్ అందుబాటులోకి రానుంది. డిస్కవరీ ప్లస్‌కు చెందిన సైన్స్, అడ్వంచర్, ఫుడ్, లైఫ్ స్టైల్, యానిమేషన్‌కు సంబంధించిన 40 రకాల కంటెంట్ జీయో ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. డిస్కవరీ+ ప్రారంభం నుంచి ప్రేక్షకుల కోసం అత్యధిక నాణ్యమైన నాన్-ఫిక్షన్ కంటెంట్‌ను తీసుకురావడానికి మరియు సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. 
 
ఈ స్ట్రీమింగ్ యాప్ 60 వేర్వేరు ఉప-శైలులలో మరియు హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు బెంగాలీతో సహా పలు భాషలలో వందలాది మార్క్యూ షోల యొక్క అద్భుతమైన లైనప్‌తో జియోఫైబర్‌లో ప్రారంభమవుతుంది. 
 
ఈ భాగస్వామ్యం జియోఫైబర్ వినియోగదారులకు డిస్కవరీ నెట్‌వర్క్ యొక్క ప్రీమియం షోలు, సూపర్ స్టార్స్ రజనీకాంత్ మరియు అక్షయ్ కుమార్, మ్యాన్ వర్సెస్ వైల్డ్, గోల్డ్ రష్, ఎక్స్‌పెడిషన్ అన్ నౌన్, 90 డే ఫైనాన్స్, హౌ ది యూనివర్స్ వర్క్స్ వంటి ప్రత్యేకమైన వాటిని యాక్సెస్ చేయడానికి అవకాశం ఇస్తుంది. 
 
ఇండియా 2050 వంటి ప్రముఖ భారతీయ సిరీస్‌లు సైతం జియో ఫైబర్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. రూ.999 మరియు అంతకన్నా ఎక్కవ ప్లాన్ కలిగి ఉన్న జియో ఫైబర్ యొక్క పాత మరియు నూతన యూజర్లు ఈ కంటెంట్‌ను జియో యాప్ స్టోర్ ద్వారా డిస్కవరీ+ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని పొందొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు, బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ