ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోతో పోటీ పడలేక ఎయిర్ టెల్, ఐడియా వంటి సంస్థలు తికమకపడుతుంటే.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.. టెలికాం రంగంలో ఏర్పడిన పోటీని ఎదుర్కోలేక నానా తంటాలు పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక మంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించిన బీఎస్ఎన్ఎల్.. తాజాగా మరో 20 వేల మంది ఉద్యోగులకు ఎసరు పెట్టింది.
కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభంతో ఉద్యోగులను తీసేస్తుంది. ఇప్పటికే కొంతమందిని ఉద్యోగాల నుండి తొలగించిన బీఎస్ఎన్ఎల్ మరో 20వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించేందుకు సిద్ధమౌతోంది. దాంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఆలోచనను విరమించుకోవాలని, కరోనా సంక్షోభ సమయంలో తమను మరిన్ని కష్టాల్లోకి నెట్టొద్దని ఉద్యోగ సంఘాలు వేడుకుంటున్నాయి.
ఇప్పటికే ఉద్యోగాల తొలగింపుకు సంబంధించి ఈ నెల 1న బీఎస్ఎన్ఎల్ తన హెచ్ఆర్ డైరెక్టర్ అనుమతితో ఒక ఉత్తర్వు జారీ చేసిందని ఆ సంస్థ ఉద్యోగ సంఘం పేర్కొంది. ఇప్పటికే ఉద్యోగసంఘం 30వేలమంది ఉద్యోగులను తొలగించిందన్నారు.