Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

05-09-2020 శనివారం దినఫలాలు - నారాయణ స్వామిని తులసీ దళాలతో అర్చిస్తే.. (video)

Advertiesment
05-09-2020 శనివారం దినఫలాలు - నారాయణ స్వామిని తులసీ దళాలతో అర్చిస్తే.. (video)
, శనివారం, 5 సెప్టెంబరు 2020 (05:00 IST)
మేషం : ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. రాజకీయాలలో వారు కొన్ని అంశాలపై చర్చలు జరుపుటవల్ల జయం చేకూరుతుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారు అచ్చు తప్పులు పడుట వల్ల మాటపడక తప్పదు. కాంట్రాక్టర్లకు నూతన పనులు చేపట్టే విషయంలో పునరాలోచన అవసరం. 
 
వృషభం : ధనవ్యయం, ధన సహాయం విషయంలో పునరాలోచన అవసరం. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. 
 
మిథునం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారుండరు. 
 
కర్కాటకం : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరుల మందు వ్యక్తిగ విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి.
 
సింహం : స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఉపాధ్యాయులు అధిక శ్రమను ఎదుర్కొంటారు. ఫ్లీడర్లకు, ఫ్లీడరు గుమస్తాలకు శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. గృహంలో మార్పులు, చేర్పులు అనుకున్నంత సంతృప్తి. స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
 
కన్య : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలించదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారు. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది.  
 
తుల : ఉద్యోగస్తులు పైఅధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. పట్టువిడుపు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని పనులు మీకు సానుకూలమవుతాయి. ప్రభుత్వ సంస్థల్లో వారు కొంత జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు. 
 
వృశ్చికం : దంపతుల మధ్య కలహాలు తలెత్తగలవు. భాగస్వామిక, వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో వైద్యుని సలహా తప్పదు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
 
 


 
ధనస్సు : స్త్రీలకు కొత్త పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలివైన లక్షణం. దైవ కార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. ఏ విషయంలోనూ ఒంటెత్తు పోకడ మంచిదికాదు. ఖర్చులు పెరిగినా మీ అవసరాలుక కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. 
 
మకరం : శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించే పరిణాలు ఎదుర్కొంటారు. వృథా ఖర్చులు, అనుకోని చెల్లింపులు వల్ల ఆటుపోట్లు తప్పవు. నూతన పరిచయాలేర్పడతాయి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. 
 
కుంభం : స్తీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. ప్రతి పని చేతిదాకా వచ్చి వెనక్కి పోవుటవల్ల ఆందోళన పెరుగుతుంది. 
 
మీనం : ఆశలొదిలేసుకున్న మొండి బాకీలు వసూలవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. పాత్రికేయులకు ఒత్తిడి పనిభారం అధికం. వైద్యులకు అనుభవజ్ఞులతో పరిచయాలు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నత స్థాయి అధికారులకు కిందిస్థాయి సిబ్బంది సహాయ సహాకారాలు లభిస్తాయి. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు, ఎప్పటి నుంచో తెలుసా?