Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆపిల్ నుంచి iPhone 15 సిరీస్‌.. ఫీచర్స్, ధరల వివరాలు ఇవే..

Advertiesment
iPhone 15
, బుధవారం, 13 సెప్టెంబరు 2023 (13:18 IST)
iPhone 15
చాలా కాలంగా నిరీక్షిస్తూ వచ్చిన ఆపిల్ కంపెనీ iPhone 15 సిరీస్‌కు సంబంధించిన విశేషాంశాలు, ధరల వివరాలు వెల్లడయ్యాయి. సంవత్సరానికి అనేక వందల స్మార్ట్‌ఫోన్‌లు విడుదలైనప్పటికీ ఆపిల్ కంపెనీ ఐఫోన్ మోడళ్లకు ఎదురుచూపులు ఆగవంటే ఆగవు.  ఈ నేపథ్యంలో ఏడాది కాలంపాటు ఊరిస్తోన్న iPhone 15 సిరీస్‌లో విశేషాంశాలు, ధరలకు సంబంధించిన సమాచారం వెలువడింది.
 
ఈ iPhone 15 సిరీస్‌లో iPhone 15, iPhone 15 Pro, iPhone 15 Pro Max, iPhone 15 Plus వంటి నాలుగు వేరియంట్‌లు విడుదలయ్యాయి. iPhone 15, iPhone 15 Pro మోడల్స్ 6.1 ఇంచ్ సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 
 
iPhone 15 Pro Max, iPhone 15 Plus మోడల్స్ 6.7 Inch Super Retina XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. iPhone 15 Pro, iPhone 15 Pro Max మాల్స్‌లో Apple A16 బయోనిక్ సిప్‌సెట్, iPhone 15, iPhone 15 Plus మోడల్స్‌లో Apple A16 బయోనిక్ సిప్‌సెట్ సెట్ చేయబడింది. 
 
ఐఫోన్ 15 సిరీస్ 
iPhone 15, iPhone 15 Plus మోడళ్లలో ఇంటెర్నల్ మెమరి 128 జిపి, 256 జిపి, 512 జిపి వంటి మూడు వేరియంట్‌లలో ఉన్నాయి. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మాక్స్ 128 జిపి, 256 జిపి, 512 జిపి, 1 టిపి ఇంటెర్నల్ మెమరి వేరియంట్‌లు ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ మోడళ్లలో 48 ఎంపి + 12 ఎంపి డూవల్ ప్రైమరీ కెమెరా, 12 ఎంపి ముందు కెమెరాలు ఉన్నాయి. 
 
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మాక్స్‌లో 48 ఎంపి + 12 ఎంపి + 12 ఎంపి ప్రైమరీ ట్రిపుల్ కెమెరాలు, 12 ఎంపి సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. iPhone 15, iPhone 15 Plus మోడళ్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు, గులాబీ వంటి రంగులు అందుబాటులో ఉన్నాయి. 
 
iPhone 15 Pro, iPhone 15 Pro Max మాక్స్ బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్ టైటానియం వంటి రంగులు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు టైప్-సి ఛార్జింగ్ బైండిల్ విడుదలైంది.
 
iPhone సిరీస్ ధరలు:
iPhone 15:
128 GB – రూ.79,900
256 GB – రూ.89,999
512 GB – రూ.1,09,900

ఐఫోన్ 15 ప్లస్:
128 GB – రూ.89,900
256 GB – రూ.99,999
512 GB – రూ.1,19,900
 
iPhone 15 Pro:
 
128 GB – రూ.1,34,900
256 GB – రూ.1,44,900
512 GB – రూ.1,64,900
1 TB - రూ.1,84,900
 
iPhone 15 Pro Max:
256 GB – రూ.1,59,900
512 GB – రూ.1,79,900
1 TB - రూ.1,99,900

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు క్షేమం కోరుతూ రిషికేశ్‌లో కేశినేని నాని యజ్ఞం