బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మహిళా ఐపీఎల్ క్రికెట్ టోర్నీపై స్పందించాడు. మహిళా క్రికెటర్లు పెరిగినప్పుడే ఐపీఎల్ నిర్వహించడం సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. మహిళా క్రికెటర్ల కోసం ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.
మహిళల టీ20 చాలెంజ్ ఈ ఏడాది మే నెలలో ఐపీఎల్ ప్లే ఆఫ్స్ సమయంలో ఉంటుంది. మహిళా క్రికెటర్లు పెరిగితే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మహిళా ఐపీఎల్ నిర్వహించడం సాధ్యపడుతుందని గంగూలీ ప్రకటించారు. వచ్చే ఏడాది అంటే 2023 పూర్తిస్థాయి మహిళల ఐపిఎల్‌ను ప్రారంభించడానికి చాలా మంచి సమయం అని తాను గట్టిగా నమ్ముతున్నానని గంగూలీ వ్యాఖ్యానించారు.
మరోవైపు, సౌరవ్ గంగూలీ తాజా వ్యాఖ్యలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. "మహిళా ఐపీఎల్‌ను ఎంతో ప్రాధాన్యంగా తీసుకోవాలి సౌరవ్ గంగూలీ" అంటూ వాన్ ట్వీట్ చేశాడు.