Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2020 : హైదరాబాద్‌కు 164 రన్స్ టార్గెట్ - రాణించిన దినేష్ కార్తీక్

ఐపీఎల్ 2020 : హైదరాబాద్‌కు 164 రన్స్ టార్గెట్ - రాణించిన దినేష్ కార్తీక్
, ఆదివారం, 18 అక్టోబరు 2020 (18:50 IST)
ఐపీఎల్ టోర్నీలోభాగంగా ఆదివారం కీలమైన నాలుగు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇందులోభాగంగా, ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. ఐదు వికెట్లను కోల్పోయింది. 
 
నిజానికి ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు 16 ఓవర్ల వరకు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. ఈ కారణంగా 4 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత పట్టు సడలించారు. ఫలితంగా కేకేఆర్ ఆటగాళ్లు చివరి నాలుగు ఓవర్లలో ఏకంగా 52 పరుగులు పిండుకున్నరు. దీంతో 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. కోల్‌‌కతా బ్యాట్స్ మెన్ విలువైన పరుగులు జోడించి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు.
 
మ్యాచ్ ఆఖర్లులో ఆ జట్టు మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో చకచకా 29 పరుగులు చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బాధ్యతగా ఆడి 34 రన్స్ నమోదు చేశాడు. 
 
అంతకుముందు ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ 36, మరో ఓపెనర్ రాహుల్ త్రిపాటి 23 పరుగులు చేయగా, నితీశ్ రానా 29 పరుగులు జోడించాడు. ఆండ్రీ రస్సెల్ 9 పరుగులు చేసి నిరాశపరిచాడు. 
 
కేకేఆర్ ఆటగాళ్లలో ఓపెనర్లు గిల్ 36, త్రిపాఠి 23, రానా 29, రస్సెల్ 9, మోర్గాన్ 34, కార్తీక్ 29 చొప్పున పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీయగా, బాసిల్ థంపి, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2020 : ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ కేకేఆర్... బ్యాటింగుకు దిగిన హైదరాబాద్