Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత సంతతి వ్యక్తులు దొరకలేదా..? ఘాటుగా రిప్లై ఇచ్చిన వినీ రామన్

Advertiesment
Glenn Maxwell
, బుధవారం, 30 సెప్టెంబరు 2020 (18:54 IST)
Glenn Maxwell
ఆస్ట్రేలియన్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత సంతతికి చెందిన ఫార్మాసిస్ట్‌ వినీ రామన్‌తో ఎంగేజ్‌‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే రెండోసారి గత మార్చిలో భారతీయ సంప్రదాయం ప్రకారం ఇరువురి కుటుంబాల సమక్షంలో మరోసారి ఎంగేజ్‌మెంట్‌ జరిపారు. 
 
తాజాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆడేందుకు దుబాయ్‌ వెళ్లిన మ్యాక్స్‌వెల్‌ను తాను మిస్సవుతున్నట్లు పేర్కొంటూ వినీ రామన్‌ వారిద్దరు కలిసి దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.‌ ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు వినీ రామన్ ఘాటుగా స్పందించింది. 
 
కొందరు సెలబ్రిటీలు కావాలని పనిగట్టుకుని ఇలాంటి కామెంట్లు చేస్తుంటారు. అలాంటి వారి గురించి తాను సాధారణంగా పట్టించుకోనని వినీ రామన్ పేర్కొన్నారు. 'ఒక తెల్ల వ్యక్తిని ఇష్టపడి తప్పు చేశారు. ఈ విషయంలో మీరు ఒకసారి ఆలోచించి ఉంటే బాగుండు. అయినా మీకు ప్రేమించడానికి భారత సంతతి వ్యక్తులు దొరకలేదా..? అంటూ ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యలు తనకు కోపం తెప్పించాయని వినీ రామన్ ఫైర్ అయ్యింది. 
 
ప్రపంచమంతా అభివృద్ధితో ముందుకు సాగుతుంటే ఒక వ్యక్తి ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం దారుణమని స్పందించింది. ఈ వ్యాఖ్యలు చేసినందుకు కాస్తయినా సిగ్గుపడాలి. ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందనేది చెప్పలేం. నాకు నేనుగా ఒక వ్యక్తి దగ్గరయ్యానంటే అది రంగు, దేశం చూసి కాదు.. మంచి మనసు చూసి అన్న విషయం అర్థం చేసుకుంటే మంచింది. 
 
అది నాకు మ్యాక్స్‌వెల్‌లో కనిపించింది.. అందుకే అతన్ని ఇష్టపడ్డా.. అయినా నేనెవరిని ఇష్టపడాలి అనేది నా ఇష్టం. ఒక తెల్లవ్యక్తిని  ప్రేమించినంత మాత్రానా నా భారతీయ సంప్రదాయానికి వచ్చిన నష్టం ఏంలేదు. మీ అభిప్రాయం చెప్పడం సరైనదే.. కానీ అది ఎదుటివారిని బాధిస్తుందా లేదా అన్నది చూసుకొని చెప్పడం మంచిదంటూ ' ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
వినీ రామన్‌ కామెంట్స్‌ను స్క్రీన్‌ షాట్‌ తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన మ్యాక్సీ..' వినీ నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. కొందరు పనిగట్టుకొని ఇలాంటి విమర్శలు చేస్తారు.. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అంటూ తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంజు శాంసన్ ధోనీ వారసుడు కాదు.. ఎవరితో పోల్చొద్దు..