Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బుమ్రాను మించిన మగాడున్నాడు.. అతనెవరో తెలుసా: డేవిడ్ హస్సీ

Advertiesment
best T20 bowler
, ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (14:54 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో బుమ్రాను మించిన బౌలర్ ఉన్నాడని కేకేఆర్ మెంటర్ డేవిడ్ హస్సీ ఉన్నట్లుండి బాంబు పేల్చాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరపున అటు ఓపెనర్‌గానూ, ఇటు ప్రధాన స్పిన్నర్‌గాను కీలక పాత్ర పోషిస్తున్న సునీల్‌ నరైన్‌పై ఆ జట్టు మెంటార్‌ డేవిడ్‌ హస్సీ ప్రశంసలు కురిపించాడు. 
 
కేకేఆర్‌కు నరైన్‌ కీలక ఆటగాడంటూ కొనియాడాడు. అసలు నరైన తమ జట్టులో ఉండటం అదృష్టమన్నాడు. ఏ పరిస్థితుల్లోనైనా అత్యుత్తమ బౌలింగ్‌ చేసే బౌలర్‌ అన్నాడు. ప్రత్యేకంగా వరల్డ్‌ టీ20 బౌలర్లలో నరైన్‌ ఒకడన్నాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలర్ ఎవరంటే తన దృష్టిలో సునీల్ నరైన్ మాత్రమే. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఎక్కడైనా బ్రేక్‌ ఇవ్వడంలో నరైన్‌ది ప్రత్యేక స్థానమని వ్యాఖ్యానించాడు.  
 
ఇకపోతే.. కేకేఆర్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌ నరైన్‌. 119 మ్యాచ్‌ల్లో 140 వికెట్లు సాధించాడు. గతేడాది ఐపీఎల్‌లో నరైన్‌ 12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లో 166.27తో 143 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో కేకేఆర్‌ రెండుసార్లు టైటిల్‌ను గెలుచుకుంది. 
 
గౌతం గంభీర్‌ సారథ్యంలో కేకేఆర్‌ 2012, 2014ల్లో టైటిల్‌ను ముద్దాడింది. అయితే ఆ తర్వాత 2016, 17, 18ల్లో ప్లేఆఫ్స్‌కు చేరినా టైటిల్‌ను మాత్రం సాధించలేకపోయింది. ఇటీవలే ముగిసిన కరీబీయన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో చాంఫియన్స్ అయిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడిన సునీల్ నరైన్ 5 మ్యాచులల్లో 6 వికెట్లు పడగొట్టాడు. అతడి ఎకానమీ రేటు 4.55 గా ఉండటం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్ విజేతగా నిలిచిన ఒసాకా