ఐపీఎల్‌కు కోహ్లీ బాటలో.. రాహుల్, మురళీ విజయ్, అశ్విన్ దూరం?
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌కు గాయాల బెడద తప్పలేదు. ఇప్పటికే ఐపీఎల్-10వ పదో సీజన్ కొన్ని మ్యాచ్‌లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమైన నేపథ్యంలో.. కోహ్లీ బాటలోనే పలువుర
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌కు గాయాల బెడద తప్పలేదు. ఇప్పటికే ఐపీఎల్-10వ పదో సీజన్ కొన్ని మ్యాచ్‌లకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమైన నేపథ్యంలో.. కోహ్లీ బాటలోనే పలువురి భారత్ స్టార్ ఆటగాళ్ల సేవలను ఫ్రాంచైజీలు కోల్పోనున్నాయి.
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మెరుగ్గా ఆడిన టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్ గాయాల కారణంగా ఏప్రిల్ 5 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 10వ సీజన్‌కు దూరమయ్యారు.
ఐపీఎల్‌లో అశ్విన్ పూణె రైజింగ్ సూపర్ జెయింట్ తరఫున ఆడుతుండగా, కేఎల్ రాహుల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, మురళీ విజయ్ పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరుపున బరిలోకి దిగుతున్నారు. ఇక అశ్విన్ హెర్నియా కారణంగా ఐపీఎల్‌కు దూరమైతే.. రాహుల్, విజయ్‌లను భుజం గాయాలు వేధిస్తున్నాయి. త్వరలో వీరిద్దరికీ శస్త్రచికిత్స జరగనుంది.