సానియా మీర్జా జోడీ అదుర్స్.. మియామీ డబుల్స్‌లో టైటిల్ వేటకు రెడీ..
మియామీ ఓపెన్ ఫైనల్లోకి భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ దూసుకెళ్లింది. ఈ టోర్నీ సెమీఫైనల్లో సానియా జోడీ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. మహిళ డబుల్స్ సెమీస్‌లో ఆద్యంతం ప్రత్యర్థి నుంచి త
మియామీ ఓపెన్ ఫైనల్లోకి భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ దూసుకెళ్లింది. ఈ టోర్నీ సెమీఫైనల్లో సానియా జోడీ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించింది. మహిళ డబుల్స్ సెమీస్‌లో ఆద్యంతం ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. సానియా-స్ట్రికోవా జోడీ 6(6)-7(8), 6-1, 10-4తో మార్టినా హింగిస్-చాన్ జంటను మట్టికరిపించింది.
హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను హింగీస్ జోడీ సొంతం చేసుకోగా, తర్వాత పుంజుకున్న సానియా జోడీ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. పాయింట్లు సాధించి.. మ్యాచ్‌ను కైవసం చేసుకునే దిశగా పట్టు కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్ నువ్వా నేనా అన్నట్లు సాగింది.
చివరికి 10-4తో సానియా జోడి సెట్‌ను గెలుచుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫలితంగా ఈ టోర్నీ టైటిల్ పోరుకు రెడీ అయ్యింది. ఈ ఫైనల్ రౌండ్లో సానియా జోడీ బ్రియల్ (కెనడా) -వై.చు (చైనా)తో తమ బలాన్ని పరీక్షించుకోనుంది.