Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్ క్రీడను ఐపీఎల్ సర్వనాశనం చేస్తోందా?

క్రికెట్ అంటే ఇప్పుడు బంతిని లాగి గ్యాలెరీలోకి కొట్టడమే అన్నట్లుగా మారిపోయింది. ఎవరు ఎక్కువగా బంతులను ఉతికేస్తారో వారే హీరో. ఐపీఎల్ క్రీడ రాకతో ఒన్డేలకు, టెస్టు క్రికెట్ క్రీడలకు ఆదరణ తగ్గిపోయింది. ఒకప్పుడు ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడ అంటే అదో క

క్రికెట్ క్రీడను ఐపీఎల్ సర్వనాశనం చేస్తోందా?
క్రికెట్ అంటే ఇప్పుడు బంతిని లాగి గ్యాలెరీలోకి కొట్టడమే అన్నట్లుగా మారిపోయింది. ఎవరు ఎక్కువగా బంతులను ఉతికేస్తారో వారే హీరో. ఐపీఎల్ క్రీడ రాకతో ఒన్డేలకు, టెస్టు క్రికెట్ క్రీడలకు ఆదరణ తగ్గిపోయింది. ఒకప్పుడు ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ క్రీడ అంటే అదో క్రేజ్. దేశాల తరపున ఆడే జట్లు ఎవరికి వారే బరిలోకి దిగి ఆయా దేశాల క్రికెట్ జట్ల బలాబలాలేమిటో తెలిపుకునేవి. ఇందులో పాకిస్తాన్-భారత్ జట్లు తలపడితే ఇక పరిస్థితి ఏమిటో వేరే చెప్పక్కర్లేదు. అలాంటిది ఐపీఎల్ రంగంలోకి రావడంతో ఆయా దేశాల్లోని క్రికెట్ ఆటగాళ్లలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయడం ద్వారా జట్లలోకి వెళ్లిపోతున్నారు. 
 
అసలు క్రికెట్ ఆటగాడు కూడా ఐపీఎల్ ఎపుడా అని ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే టెస్ట్, ఒన్డే క్రికెట్ క్రీడల ద్వారా ఆటగాడికి వచ్చే మొత్తం బహు స్వల్పం. అదే ఐపీఎల్ ద్వారా అయితే కేవలం నెల రోజుల్లోనే కోట్ల రూపాయలు. ఒప్పందాలు ఇక సరేసరి. అలా ఒకే ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఇపుడు ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు ఐపీఎల్ పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వెస్టిండీస్ జట్టు అంటే ఒకప్పుడు ప్రపంచానికి ఓ సవాల్. 
 
ఇప్పుడు వెస్టిండీస్ ఆటగాళ్లు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లుగా మారిపోయారు. దీనితో జట్టు కదలికపై వెస్టిండీస్ బోర్డు ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకునేదాకా వెళ్లిపోయింది. మన దేశ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ పుణ్యమా అని తమ సంప్రదాయ క్రికెట్ క్రీడకు బదులు ఉతుకుడు కార్యక్రమాన్ని చేసేస్తున్నారు. ఒక సచిన్, ఒక గవాస్కర్... వంటి మేటి పరుగుల రారాజుల వంటి వారిని ఐపీఎల్ మాయం చేసేస్తుందేమోనన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి..