Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి..

మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో భారత పోరు ముగిసింది. భారత షట్లర్లు పీవీ సింధూ, సైనా నెహ్వాల్‌లు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బుధవారం జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే చైనాకు చెందిన అన్‌సీడెడ

Advertiesment
మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమి..
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (10:00 IST)
మలేషియా ఓపెన్ తొలి రౌండ్లో భారత పోరు ముగిసింది. భారత షట్లర్లు పీవీ సింధూ, సైనా నెహ్వాల్‌లు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బుధవారం జరిగిన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే చైనాకు చెందిన అన్‌సీడెడ్‌ చెన్‌ యుఫీ 18-21, 21-19, 21-17 స్కోరుతో సింధూపై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన అకనే యమగుచి 19-21, 21-13, 21-15 స్కోరుతో సైనా నెహ్వాల్‌పై సునాయాసంగా గెలుపును నమోదు చేసుకుంది.
 
అయితే మలేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో భారత క్రీడాకారుడు అజయ్‌ జయరామ్‌ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో జరిగిన మ్యాచ్‌లో చైనాకు చెందిన కియో బిన్‌పై 21-11, 21-8 వరస సెట్లలో సునాయసంగా గెలుపొందాడు. కేవలం 31 నిమిషాల్లోనే జయరామ్ మ్యాచ్‌ను ముగించాడు. 
 
కాగా, పురుషుల డబుల్స్‌ విభాగంలో భారత జోడి ఓటమి పాలైంది. మను అత్రి-సుమిత్‌ రెడ్డి జోడీపై 18-21, 21-18, 21-17 స్కోరుతో చైనీస్‌ తైపీకి చెందిన లియో కౌన్‌ హు-లు చియా పిన్‌ జోడీ గెలుపొందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధోనీ లాంటి క్రికెటర్ జట్టులో ఉండటం కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు అదృష్టం: రవిశాస్త్రి