Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యుద్ధానికి సిద్ధం.. భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వార్నింగ్

తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా వెనుకాడబోమని చైనా శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన జీ జిన్‌పింగ్ ప్రకటించారు. ఇది ఒక రకంగా భారత్‌కు హెచ్చరికలాంటిదే.

యుద్ధానికి సిద్ధం.. భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వార్నింగ్
, మంగళవారం, 20 మార్చి 2018 (12:27 IST)
తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా వెనుకాడబోమని చైనా శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన జీ జిన్‌పింగ్ ప్రకటించారు. ఇది ఒక రకంగా భారత్‌కు హెచ్చరికలాంటిదే. గత కొంతకాలంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తమవేనంటూ చైనా సైనికులు చొరబాట్లకు ప్రయత్నిస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఇక్కడ ఇరు దేశాల సైనికులు తోపులాటకు కూడా దిగారు. ముఖ్యంగా డోక్లాం సరిహద్దులో భారత్, చైనాల మధ్య యుధ్ధ వాతావరణం నెలకొంది. రెండు నెలల తర్వాత ఇక్కడ పరిస్థితులు చక్కబడ్డాయి. 
 
ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన జిన్‌పింగ్ మంగళవారం జరిగిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ముగింపు వేడుకల్లో భారత్‌కు హెచ్చరికలు పంపేలా మాట్లాడారు. తమ భూభాగంలో అంగుళం కూడా వదులుకునేది లేదని తేల్చిచెప్పారు. బలమైన చైనాను నిర్మించడమే తన లక్ష్యమన్నారు. 
 
దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజల ఆకాంక్ష కూడా ఇదేనన్నారు. చైనాను విడగొట్టాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనన్నారు. ప్రపంచ దేశాల్లో మా స్థానాన్ని తిరిగి పొందడం కోసం యుద్ధానికైనా వెనుకాడేది లేదని జిన్‌పింగ్‌ తెగేసి చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ మనల్ని ఇంతలా డ్యామేజ్ చేస్తాడని కలలో కూడా ఊహించలేదు : చంద్రబాబు